Breaking News

అర్థరాత్రి ఆటోలో ఒంటరి మహిళ : ఆ నోట్‌ చూసిందంతే!

Published on Sat, 12/13/2025 - 14:45

అర్థరాత్రి రద్దీగా ఉండే నగరాల్లో కూడా అర్థరాత్రి మహిళలు  ఒంటరిగా ప్రయాణించాలంటే బిక్కు బిక్కుమంటూ వెళ్లాల్సిందే.  క్యాబ్‌ సేవలు  అందించే సంస్థలకు చెందిన ఆటో,క్యాబ్‌, బైక్‌ డ్రైవర్లు మర్యాదగానే ఉంటారు.   అయినా కూడా సురక్షింగా  గమ్య స్థానానికి చేరేదాకా మనసులో బెరుకు  తప్పదు. తాజాగా బెంగళూరులో రాపిడో ఆటోలో అర్ధరాత్రి ఇంటికి ప్రయాణిస్తున్న ఒక మహిళకు అనుభవం నెట్టింట విశేషంగా నిలిచింది.

రాత్రి 12 గంటలకు అర్థరాత్రి, ఒంటరిగా ఉన్నప్పటికీ తన ప్రయాణంలో తాను ధైర్యంగా గడిపిన క్షణం గురించి వివరించిన వీడియోను షేర్ చేసింది. నిజంగా ఆటోలు కనిపించిన ఒక నోట్‌ను ఆమెలోఆనందాశ్చర్యాల్ని నింపింది. వాహనం లోపల అతికించిన చేతితో రాసిన నోట్‌ను చూపించడానికి కెమెరాను అటు తిప్పింది. అక్కడ ఇలా ఉంది: "నేను ఒక తండ్రిని, సోదరుడుని కూడా. మీ భద్రత ముఖ్యం. హాయిగా ప్రశాంతంగా కూర్చోండి."అని ఒక నోట్‌లో రాసి ఉండటం విశేషం. అంటే ఆ సమయంలో ఒంటరిగా ప్రయాణించే మహిళల మనస్సుల్లో  చెలరేగే భావాలను, భయాలను అర్థం చేసుకుని భయపడకండి.. నేనూ  ఒక బిడ్డకు తండ్రినే, ఒక సోదరికి అన్నయ్యను కూడా..భయపడకుండా కూర్చోండి, నా వలన మీకెలాంటి ప్రమాదం ఉండదు అని ధైర్యం చెప్పడం  బాగా ఆకట్టుకుంటోంది.

ఇదీ చదవండి: చిలుకను కాపాడబోయి : తనువు చాలించిన వ్యాపారవేత్త

 ఈ వీడియోను లిటిల్ బెంగళూరు స్టోరీస్ "పీక్ బెంగళూరు" అనే శీర్షికతో పోస్ట్ చేసింది . దీంతో నెటిజన్ల నుండి హృదయపూర్వక స్పందనలు వచ్చాయి. "గత 20 సంవత్సరాలుగా నాకు ఈ నగరం తెలుసు! ఇది అందరికీ అత్యంత సురక్షితమైన నగరం." ‘‘మేము కోరుకుంటున్నది , మనం చేయవలసినది ఇదే" అంటూ వ్యాఖ్యానించారు. ‘‘ఇలాంటి చిన్ని చిన్న  విషయాలు చాలు.  నగరంలోని మహిళలకు అర్థరాత్రి ప్రయాణం సురక్షితంగా అనిపించేలా చేయడంలో సహాయపడతాయి’’ అని మరొకరు కామెంట్‌ చేశారు. శభాష్‌..భయ్యా..ఇలాంటి భరోసానే కావాల్సింది అంటూ మరికొందరు  ఆటో డ్రైవర్‌ను కొనియాడారు.

 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)