Breaking News

నిందితుడిని పట్టించిన ఫోన్‌ కాల్‌

Published on Sat, 03/29/2025 - 07:41

బనశంకరి: భార్యను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా కత్తరించి  సూట్‌కేసులో పెట్టి ఉడాయించిన టెక్కీ రాకేశ్‌ రాజేంద్ర ఖడేకర్‌ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. మిత్రుడికి చేసిన ఫోన్‌ కాల్‌ అతన్ని పోలీసులకు  పట్టించింది. భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలుగా కత్తిరించి సూట్‌కేస్‌లో పెట్టి బాత్‌రూమ్‌లో దాచి మహారాష్ట్రకు వెళ్తూ మార్గమధ్యంలో భార్య కుటుంబ సభ్యులకు  ఫోన్‌ చేశాడు. మీ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పి కాల్‌ కట్‌ చేశారు. 

అదే సమయంలో ఇతను నివాసం ఉండే అద్దె ఇంటి కింద ఉన్న స్నేహితుడికి ఫోన్‌ చేసి తన భార్యను హత్యచేసినట్లు తెలిపాడు. స్నేహితుడి మొబైల్‌కు వచ్చిన ఫోన్‌ కాల్‌ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పుణె మార్గమధ్యంలో సంచరిస్తున్నట్లు గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం చేరవేశారు.  పుణె చేరుకోగానే రాకేశ్‌ కారు రోడ్డు పక్కన నిలిపి దుకాణంలో ఫినాయిల్‌ను కొనుగోలు చేసి తాగి ఆత్మహత్యకు ప్రయతి్నంచాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న పుణె పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. దీంతో ప్రాణాలతో బయటపడినట్లు పోలీసులు తెలిపారు.  

పుణెకు చేరిన హుళిమావు పోలీసులు 
పుణే వైపు వెళుతున్నట్లు సమాచారం అందుకున్న హుళిమావు పోలీసుల బృందం కూడా అక్కడికి చేరుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాకేశ్‌ కోలుకోగానే అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకు వస్తారు. టెక్కీ రాకేశ్‌ భార్యను హత్య చేయడానికి కచ్చితమైన కారణం తెలియరాలేదు. కుటుంబ కలహాల కారణంతో హత్య చేసినట్లు సమాచారం ఉందని కమిషనర్‌ దయానంద్‌ శుక్రవారం విలేకరులకు తెలిపారు.  అతడి ఆరోగ్యం స్దిరంగా ఉందని డాక్టర్లు తెలిపిన అనంతరం బెంగళూరుకు తీసుకువచ్చి విచారణ చేపడతామన్నారు. విచారణ అనంతరం భార్య హత్యకు కారణాలు ఏమిటో తెలియనుంది. మృతురాలు గౌరీ కుటుంబ సభ్యులు నగరానికి చేరుకోగా వారి నుంచి కూడా సమాచారం సేకరించామన్నారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)