Breaking News

లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన ఎస్‌ఐ

Published on Mon, 06/15/2026 - 08:03

బెంగళూరు: రాష్ట్రంలో అవినీతి అనేది ఉండరాదని నూతన సీఎం డీకే శివకుమార్‌ పిలుపునిచ్చిన కొన్ని గంటల్లోనే.. రాష్ట్ర పోలీసులు అందుకు భంగం కలిగించేలా ప్రవర్తించారు. పరాయి రాష్ట్రంలో లంచం తీసుకుంటూ అక్కడి ఏసీబీకి దొరికిపోవడంతో రాష్ట్ర పోలీసుల పరువు ప్రశ్నార్థకమైంది.  

రూ.2 లక్షలు ఇవ్వాలని.. 
వరకట్నం వేధింపుల కేసులో నిందితుడిని అరెస్టు చేయడానికి రాజస్థాన్‌కు వెళ్లిన బెంగళూరు హెచ్‌ఏఎల్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ అనిత, హెడ్‌ కానిస్టేబుల్‌ ఉళవప్ప, కానిస్టేబుల్‌ యతీష్‌ అక్కడి ఏసీబీకి పట్టుబడ్డారు. హెచ్‌ఏఎల్‌ పీఎస్‌లో నమోదైన  కట్నం వేధింపుల కేసులో నిందితుడు జైపూర్‌లో ఉన్నాడని తెలిసి అరెస్టు చేయడానికి వెళ్లారు. నిందితుని ఇంటికి వెళ్లి బేరసారాలు ప్రారంభించారు. తమకు రూ.2 లక్షల లంచం ఇస్తే, అరెస్టు చేయకుండా వెళ్లిపోతామని తెలిపారు. 

అంత మొత్తం ఇవ్వలేనని, కొంత ఇస్తానని చెప్పిన నిందితుడు, ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. ఓ లాడ్జిలో రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా స్థానిక ఏసీబీ అధికారులు అనిత, ఇతర పోలీసులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. వీరి బాగోతం బెంగళూరు పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)