Breaking News

Be alert! మెట్రో రైళ్లలో అమ్మాయిల్ని క్లిక్‌మనిపించి..

Published on Fri, 05/23/2025 - 17:05

క్రైమ్‌: మనకు తెలియకుండానే మన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యక్షమవుతున్న రోజులివి. మరీ ముఖ్యంగా మహిళల విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉంటోంది. వాళ్లలో కొందరు ముందుకు వచ్చి పోలీసులను ఆశ్రయిస్తుండడంతో నిందితులను సైతం పట్టుకోగలుగుతున్నారు.  

ఆ మధ్య ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఓ యువకుడు రోడ్డు మీద వెళ్లే అమ్మాయిలను అసభ్యకరరీతిలో ఫొటోలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ నడిపి ఊచలు లెక్కిస్తున్నాడు. తాజాగా బెంగళూరులోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. బెంగళూరు మెట్రో రైళ్లలో అమ్మాయిలను ఫొటోలు తీసి.. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్‌ ఓపెన్‌ చేసి అప్‌లోడ్‌ చేస్తున్నాడు ఓ వ్యక్తి. పదుల సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో బుధవారం పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆపై ఆ పోకిరీపై నజర్‌ వేశారు. 

చివరకు.. అతన్ని పట్టుకున్నట్లు బెంగళూరు పోలీసులు శుక్రవారం ప్రకటించారు. Bangalore Metro Clicks (@metro_chicks) పేరిట నడిపిన ఆ అకౌంట్‌లో వందల కొద్దీ అమ్మాయిల చిత్రాలు ఉన్నాయి. ఆ అకౌంట్‌కు ఐదు వేళ మంది ఫాలోవర్స్‌ ఉన్నారని పోలీసులు వెల్లడించారు. అందులో ఉన్న మొత్తం ఫొటోలను తొలగించి..  అకౌంట్‌ను సైతం తొలగించారు. అయితే నిందితుడి వివరాలు వెల్లడించాల్సి ఉంది. తస్మాత్‌ జాగ్రత్త.. మీ చుట్టుపక్కలా ఇలాంటి కామాంధులు ఉండొచ్చు! జర జాగ్రత్త!!.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)