Breaking News

రూ. 50 కోట్ల కుక్క.. ఈడీ దాడులు!

Published on Thu, 04/17/2025 - 21:10

ఏదైనా గొప్పలకు పోతే ఇలానే ఉంటుంది. గొప్పగా బ్రతకొచ్చు.. నీ గొప్పను అవతలి వాడు చెప్పుకోవాలి.. అంతేకానీ మనకు అవకాశం దొరికింది కదాని లేనిపోని గొప‍్పలకు పోతే ఇలానే ఉంటుంది. ఓ వ్యక్తి గొప్పలకు పోయాడు. తాను  ఓ కుక్కును పెంచుకుంటున్నాడు.  అది సహజమే. కాకపోతే ఆ కుక్క విలువ రూ. 50 కోట్లు అంటూ గొప్పలకు పోయాడు. నిజంగానే ఆ కుక్క విలువ రూ. 50 కోట్లు ఉంటుందో లేదో తెలీదు కానీ, ఇక్కడ  ఆ మనిషి నోరు జారిన ‘గొప్ప’ ఈడీ రైడ్స్ వరకూ వెళ్లింది.

విషయంలోకి వెళితే..  తాను అత్యంత ఖరీదు అని చెప్పుకునే కుక్కను తీసుకుని గత ఫిబ్రవరిలో ఓ షోకు వెళ్లాడు సతీష్ అనే వ్యక్తి. అక్కడ తన కుక్క విలువ రూ. 50 కోట్లంటూ ఏవో గొప్పలు చెప్పుకున్నాడు.  ఇదొక అరుదైన జాతి కుక్క అని, దీని విలువ లక్షరాల రూ. 50 కోట్లని బహిరంగంగా ప్రకటించాడు.   ఇది ఆనోట ఈనోట మారి ఈడీ వరకూ వెళ్లింది. ఫిబ్రవరిలో ఏదో చెప్పుకున్నాడు.. కానీ ఈడీ ఓ కన్నేసి ఉంచింది. అతనికి రెండు నెలల తర్వాత సోదాల పేరుతో వెళ్లింది. కుక్కనే అంత పెట్టి కొన్నాడంటే ఇంక ఎంత  ఉంటుందో అని ఈడీ లెక్కలు వేసుకుంది. అంతే అతనికి  ఇంటికి గురువారం వెళ్లి సోదాలు చేపట్టింది.

ఈ క్రమంలోనే అతనికి సంబంధించి అన్నీ ఆరాలు తీసింది. అతని బ్యాంకు అకౌంట్లను క్షుణ్ణంగా పరిశీలించింది. అయితే పెద్ద మొత్తంలో ఏమీ లావాదేవీలను జరగలేదని విషయాన్ని గుర్తించింది. కుక్కను రూ. 50 కోట్లను పెట్టి కొనుగోలు చేసినట్లు అతను చెప్పిన కోణంలో సమగ్రంగా దర్యాప్తు చేసింది. అయితే అతను లావాదేవీల్లో అంత పెద్ద మొత్తాన్ని ఈడీ గుర్తించలేదు. హవాలా రూట్ లో ఏమైనా చేశాడా.. అనే కోణాన్ని ఈడీ దర్యాప్తు చేసినట్లు తెలుస్తోంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)