Breaking News

ధోతీ ధ‌రించాడ‌ని అనుమ‌తి నిరాక‌ర‌ణ‌.. మాల్ అధికారుల‌కు షాక్

Published on Thu, 07/18/2024 - 16:03

బెంగ‌ళూరు: ధోతీ ధరించారన్న కారణంతో ఓ రైతును మాల్‌ సిబ్బంది లోపలికి అనుమ‌తించ‌లేని ఘ‌ట‌న మంగ‌ళ‌వారం బెంగ‌ళూరులో చోటుచేసుకున్న విఫ‌యం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైర‌ల్‌గా కూడా మారింది. దీంతో నెటిజ‌న్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

తాజాగా ఈ విష‌యం అధికారుల దృష్టికి చేరింది. సంబంధిత మాల్‌పై ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌కు పూనుకుంది. వృద్ధ రైతుకు ధోతి ధ‌రించినందుకు ప్ర‌వేశం నిరాక‌రించిన జీటీ వ‌ర‌ల్డ్‌ షాపింగ్ మాల్‌ను వారం రోజులపాటు మూసివేయాల‌ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ఆదేశించింది.

వృద్ధ రైతుకు ధోతీ ధరించినందుకు ప్రవేశం నిరాకరించడంతో బెంగళూరు షాపింగ్ మాల్‌ను వారం రోజుల పాటు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. ఇలాంటి చ‌ర్య‌కు పాల్ప‌డినందుకు చట్టం ప్రకారం చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంద‌ని అందుకే ఏడు రోజులు మూసివేయాల‌ని ఆదేశించిన‌ట్లు గురువారం పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బైరతి సురేష్ వెల్ల‌డించారు.

 కాగా బెంగళూరులోని జీటీ మాల్‌లో సినిమా చూసేందుకు ఓ తండ్రీ, కుమారులు వచ్చారు. మాల్‌లోకి వెళ్తుండగా అక్కడి భద్రతా సిబ్బంది ఆ రైతుని అడ్డగించి లోపలికి అనుమతి నిరాకరించారు. ఆ రైతు ధోతీ ధరించిన కార‌ణంగా అనుమ‌తి లేద‌ని సిబ్బంది తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో మాల్‌ యాజమాన్యంపై నెటిజన్లు మండిప‌డుతున్నారు.

 

ఇదిలా ఉండ‌గా మాల్ యజమాని, సెక్యూరిటీ సిబ్బంది భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 126(2) కింద కేసు నమోదు అయ్యింది. అలాగే బుధ‌వారం రైతు సంఘాలు మాల్‌ ఎదుట ఆందోళనకు కూడా దిగాయి. ఆ రైతుకి, అతడి కుమారుడికి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. మాల్‌ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే వేలాదిమంది రైతులతో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. దీంతో ఆ భద్రతా సిబ్బంది రైతు, అతడి కుమారుడికి క్షమాపణలు చెప్పారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)