బీబీసీ డాక్యుమెంటరీ.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

Published on Fri, 02/03/2023 - 12:58

సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ ప్రసారం చేసిన ఓ డాక్యుమెంటరీ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. కేంద్రం ఆ డాక్యుమెంటరీని, దానికి సంబంధించిన లింకులను భారత్‌లో బ్లాక్‌ చేసింది. ఈ పరిణామంపై పిటిషన్‌లు దాఖలుకాగా.. శుక్రవారం విచారణ సందర్భంగా సుప్రీం కోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది.  

ప్రధాని నరేంద్ర మోదీ, 2002 గుజరాత్ అల్లర్లపై వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీని అడ్డుకోవాలన్న కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అప్పీళ్లపై సుప్రీంకోర్టు ఈరోజు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. కేంద్రం ఆ డాక్యుమెంటరీని నిషేధించడాన్ని సవాల్‌ చేస్తూ.. అలాగే భవిష్యత్‌లోనూ సెన్సార్‌ చేయకుండా అడ్డుకోవాలని పిటిషనర్‌ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్‌లో తదుపరి విచారణ ఉంటుందని తెలిపింది. 

ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన వివాదాస్పద డాక్యుమెంటరీని నిషేధించడంపై సుప్రీం కోర్టులో పిటిషన్‌లు దాఖలయ్యాయి. పబ్లిక్‌ డొమైన్‌ నుంచి దానిని తొలగించడాన్ని.. డాక్యుమెంటరీ లింకులను సోషల్‌ మీడియా నుంచి తొలగించేందుకు కేంద్రం తన విశేష అధికారాలను ఉపయోగించడాన్ని సవాల్‌ చేస్తూ ఓ పిటిషన్‌ దాఖలు అయ్యింది. ఇది రాజ్యాంగవిరుద్ధమైన చర్యగా అభివర్ణించారు పిటిషనర్‌ తరపు న్యాయవాది ఎంఎల్‌ శర్మ. ఇక.. దిగ్గజ జర్నలిస్ట్‌ ఎన్‌ రామ్‌, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మెయిత్రా మరో ప్రత్యేక పిటిషన్‌ దాఖలు చేశారు.
 
గుజరాత్‌ అలర్ల సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని విమర్శిస్తూ రెండు భాగాలుగా ఇండియా: ది మోదీ క్వశ్చన్‌ పేరుతో డాక్యుమెంటరీ ప్రసారం చేసింది. దీంతో దుమారం రేగింది. ఇంగ్లండ్‌లో ఉన్న భారత సంతతి సైతం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. మరోవైపు జనవరి 21వ తేదీన కేంద్రం ఐటీ రూల్స్‌ 2021 ప్రకారం.. విశేష అధికారాలను ఉపయోగించి యూట్యూబ్‌, ట్విట్టర్‌లలో డాక్యుమెంటరీకి సంబంధించిన లింకులను, పోస్టులను తొలగించింది.

Videos

అసెంబ్లీలో కేసీఆర్ కు సీఎం రేవంత్ షేక్ హ్యాండ్

రూ. 1000 కోట్లకు ప్లాన్ చేసిన.. రజినీకాంత్ జైలర్ 2

అసలు నీకు బుర్ర ఉందా? బీటెక్ రవిని ఇచ్చిపడేసిన అవినాష్ రెడ్డి

Nagarjuna Yadav: రియల్ ఎస్టేట్లకు బంపర్ ఆఫర్ ప్రభుత్వమే భూములు దొంగతనం

కోతల రాయుడు.. ఆంజనేయులపై బొల్లా బ్రహ్మనాయుడు ఫైర్

70కోట్ల ప్యాకేజీతో నవరంధ్రాలు మూసుకుని... పవన్ పై రాచమల్లు ఫైర్

అసెంబ్లీలో ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ఫస్ట్ స్పీచ్

అసెంబ్లీలో కేసీఆర్ ను పలకరించిన సీఎం రేవంత్

అండర్-19 వరల్డ్ కప్ టీమ్ వచ్చేసింది.. అందరి కళ్లు అతడిపైనే..!

రెడ్ బుక్ ఆర్డర్.. పోలీసులు జీ హుజూర్

Photos

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)

+5

గచ్చిబౌలి స్టేడియం : కూచిపూడి కళావైభవం గిన్నీస్‌ ప్రపంచ రికార్డు (ఫొటోలు)

+5

'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 28- జనవరి 04)

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)