బంగ్లాదేశ్‌ ‘హకీమ్‌’.. బీహార్‌ ‘నవాబ్‌’గా మారి..

Published on Mon, 10/07/2024 - 11:32

సీమాంచల్: బంగ్లాదేశ్ చొరబాటుదారులు రహస్యంగా బీహార్‌లోని సీమాంచల్ ప్రాంతానికి వచ్చి స్థిరపడుతున్నారు. బీహార్‌లో కొన్నేళ్లుగా రహస్యంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ పౌరుడిని అరారియా పోలీసులు అరెస్టు చేసిన దరిమిలా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

బంగ్లాదేశ్‌కు చెందిన ఓ పౌరుడు గత కొన్నేళ్లుగా అరారియా పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్ కోడర్‌కట్టి పంచాయతీలోని మారంగి తోలాలో రహస్యంగా నివసిస్తున్నాడు. ఆయన తన పాస్‌పోర్టుకు సంబంధించిన పని కోసం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చినప్పుడు ఈ విషయం వెలుగు చూసింది. పోలీసుల విచారణలో అతను బంగ్లాదేశ్ నివాసి అని, ఆరేళ్లుగా కతిహార్, అరారియాలో రహస్యంగా నివసిస్తున్నట్లు తేలింది.

ఈ బంగ్లాదేశ్ పౌరుడు భారతదేశంలో మోసపూరితంగా గుర్తింపు కార్డు కూడా సంపాదించాడు. ఇందులో అతని పేరు నవాబ్‌గా నమోదయివుంది. పోలీసులు అతనిని అరెస్ట్ చేసిన దరిమిలా, మరిన్ని రహస్యాలను బయటపెట్టాడు. ఈ నేపధ్యంలో పోలీస్ స్టేషన్‌లో ఏఎస్పీ రాంపుకర్ సింగ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, ఆ బంగ్లాదేశీయునికి సంబంధించిన వివరాలు తెలిపారు. తాము అరెస్టు చేసిన బంగ్లాదేశీయుడు హకీమ్‌ హకీమ్ పిటా అన్సార్ అలీ తన పేరును నవాబ్ (24)గా మార్చుకుని మారంగి తోలాలోలో నివసిస్తున్నాడని తెలిపారు. హకీమ్‌ మూడేళ్ల క్రితం ఇక్కడే పెళ్లి చేసుకున్నాడని, తన బంగ్లాదేశ్ గుర్తింపును దాచి ఇక్కడ నివసిస్తున్నాడన్నారు. స్థానిక పౌరునిగా గుర్తింపు పొందేందుకు అక్రమంగా ఓటర్ కార్డు, ఆధార్ కార్డును కూడా తయారు చేయించుకున్నాడని తెలిపారు. హకీమ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇది కూడా చదవండి: ఆడ శిశువును విక్రయించిన తల్లి

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)