Breaking News

ప్రాణం మీదకొచ్చిన పార్టీ

Published on Tue, 12/16/2025 - 07:09

బెంగళూరు: స్నేహితులతో కలిసి హోటల్‌లో పార్టీ చేసుకుంటున్న సమయంలో పోలీసులు రావడంతో భయపడి ఓ  యువతి పరుగులు తీసే క్రమంలో పై నుంచి కిందపడిపోయింది. ఈ ఘటన బెంగళూరు హెచ్‌ఏఎల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. వైష్ణవి (21), 8 మంది స్నేహితులతో ఏఇసీఎస్‌ లేఔట్‌లోని ఓ హోటల్‌లో 3వ అంతస్తులో పార్టీ పెట్టుకున్నారు. 

స్థానికులు ఫిర్యాదు చేయడంతో  
అర్ధరాత్రి గట్టిగా మ్యూజిక్‌ వేసుకుని  కేకలు వేస్తూ డ్యాన్స్‌ చేస్తుండటంతో చుట్టుపక్కల ఇళ్లవారు 112 కు ఫోన్‌చేశారు. స్థానిక పోలీసులు వచ్చి పార్టీ జరుగుతున్న పై అంతస్తుకు వెళ్లారు. దీంతో అందరూ తలోదిక్కుకు పరుగులు తీశారు. వైష్ణవి భయపడి పోలీసుల నుంచి తప్పించుకోవడానికి పై అంతస్తు నుంచి పైపును పట్టుకుని కిందికి దిగడానికి ప్రయత్నిస్తుండగా జారి కింద ఇనుప గ్రిల్స్‌ మీద పడడంతో తీవ్రంగా గాయపడింది. ఆమెను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తలకు, శరీరానికి తీవ్ర గాయాలు కావడంతో మృత్యువు అంచుల్లో ఉంది.  

లంచం అడిగారు  
హోటల్‌ వద్దకు వచ్చిన పోలీసులు కేసు కాకూడదంటే డబ్బులు ఇవ్వాలని అడిగారు, మేము ఫోన్‌ పే చేస్తామని చెప్పగా, వద్దు క్యాష్‌ కావాలన్నారు అని పారీ్టలో పాల్గొన్నవారు ఆరోపించారు. దీనిపై డీసీపీ విచారణ చేపట్టారు. హోటల్, పోలీసు సిబ్బందిపై యువతి తండ్రి ఆంథోనీరాజ్‌ హెచ్‌ఏల్‌ ఠాణాలో ఫిర్యాదు చేశాడు.     
 

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)