Breaking News

Baghpat Incident: లడ్డూ పండుగలో విషాదం.. ఏడుగురు మృతి

Published on Tue, 01/28/2025 - 11:00

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో ఈరోజు (మంగళవారం) పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఆదినాథుని నిర్వాణ లడ్డూ పండుగ సందర్భంగా మానస్తంభ్ కాంప్లెక్స్‌లో నిర్మించిన చెక్క నిర్మాణం కూలిపోయింది. ఈ ఘటనలో 50 మందికి పైగా భక్తులు శిథిలాల కింద చిక్కుకున్నారు. తాజాగా ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది.

ఈ ఘటన గురించి బాగ్‌పత్ పోలీసు అధికారి అస్మితా లాల్ మాట్లాడుతూ ‘బరౌట్‌లో జైన సమాజ ఉత్సవం జరుగుతుండగా, ఒక చెక్క నిర్మాణం కూలిపోయింది. ఫలితంగా 40 మంది గాయపడ్డారు. చికిత్స తర్వాత 20 మందిని వారి ఇళ్లకు పంపించారు. మరో 20 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏడుగురు  మృతి చెందారు’ అని తెలిపారు.

యూపీ: బాగ్‌పత్‌లో ఘోర ప్రమాదం

ఈ ప్రమాదం మంగళవారం ఉదయం బరౌత్‌లోని గాంధీ రోడ్డులో జరిగింది. ప్రమాదం అనంతరం సంఘటనా స్థలంలో తొక్కిసలాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని  సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో  ఏడుగురు పోలీసులు కూడా గాయపడ్డారని తెలుస్తోంది. ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే డిఎం అస్మితా లాల్, ఎస్పీ అర్పిత్ విజయవర్గియా ఆసుపత్రికి చేరుకుని గాయపడిన వారిని పరామర్శించారు.

బాగ్‌పత్‌లో జరిగిన ప్రమాదం గురించి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలుసుకున్నారు. అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని  ఆదేశించారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి సరైన చికిత్స అందించాలని జిల్లా పరిపాలన అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఇది కూడా చదవండి: Mahakumbh : 15 కోట్ల మంది పుణ్యస్నానాలు పూర్తి.. మౌని అమావాస్య అంచనాలివే

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)