Breaking News

సిద్ధిఖీ కేసు: ‘యూట్యూబ్‌ చూసి నిందితుల గన్‌ షూటింగ్‌ ప్రాక్టిస్‌’

Published on Wed, 10/16/2024 - 09:12

ముంబై: మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ( అజిత్‌ పవార్‌ వర్గం) నేత బాబా సిద్ధిఖీ‌ను హత్యకు సంబంధించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. సిద్ధిఖీని హత్య చేయడానికి నిందితులు గుర్‌మైల్ సింగ్, ధరమ్‌రాజ్ కశ్యప్‌లు యూట్యూబ్ వీడియోలు చూసి షూట్ చేయడం నేర్చుకున్నారని ముంబై పోలీసుల వర్గాలు వెల్లడించాయి. 

ఈ  హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. పరీరాలో ఉన్న వారిని వెతకడానికి పోలీసులు బృందాలను గాలిస్తున్నారని పేర్కొన్నారు. ఈ హత్య కేసును ముంబై  క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తున్నారు. 7.62 ఎంఎం తుపాకీతో కూడిన ఓ నల్ల బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

‘‘సిద్ధిఖీని గుర్తించడానికి నిందితులకు ఆయన ఫోటోను ఇచ్చారు. ఘటనకు 25 రోజుల ముందు నిందితులు ఆయన నివాసం, కార్యాలయాన్ని పరిశీలించారు. గుర్మైల్ సింగ్ , ధరమ్‌రాజ్ కశ్యప్ యూట్యూబ్ నుంచి షూటింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నారు. ముంబైలో బుల్లెట్‌ మ్యాగజైన్ లేకుండా గన్‌ షూటింగ్ ప్రాక్టీస్ చేశారు’’ అని ముంబై పోలీసు వర్గాలు తెలిపాయి.

ఇక.. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌కు చెందిన 23 ఏళ్ల హరీష్‌కుమార్ బాలక్‌రామ్‌గా ఈ హత్యకేసులో నాలుగో నిందితుడిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యకు ఆర్థిక సహాయం అందించడం, లాజిస్టిక్స్‌ను సమన్వయం చేశాడని పోలీసులు తెలిపారు. బాలక్‌రామ్ పూణెలో స్క్రాప్ షాప్‌ డీలర్‌గా పనిచేస్తున్నాడని పేర్కొన్నారు. ముగ్గురు నిందితుల్లో ఇద్దరు బాలక్‌రామ్‌గా స్క్రాప్ షాపులో పనిచేసేవారని పోలీసులు వెల్లడించారు.

చదవండి: సిద్దిఖీ హత్యకు పుణెలో కుట్ర

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)