Breaking News

సిద్ధిఖీ కేసు: మృతి నిర్ధారణయ్యే వరకు ఆస్పత్రి దగ్గరే..

Published on Thu, 11/14/2024 - 09:17

ముంబై: మహారాష్ట్ర ఎన్సీపీ(అజిత్‌ పవార్‌ వర్గం) నేత బాబా సిద్ధిఖీ కేసు విషయంలో రోజుకో కొత్త వెలుగులోకి వస్తోంది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు(షూటర్‌)ను విచారణ చేస్తున్న ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు కీలక విషయాలు వెల్లుడిస్తున్నారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు శివ్ కుమార్ గౌతమ్.. సిద్ధిఖీపై కాల్పుల జరిపిన అనంతరం ఆయన  మరణించారా? లేదా? అని ఆస్పత్రి బయట ఉండి నిర్ధారించుకున్నాడని పోలీసులు తెలిపారు. 

అయితే.. కాల్పులు జరిగిన తర్వాత సిద్ధిఖీని లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా.. ఆస్పత్రి బయట ఆయన మృతి నిర్థారణ కోసం సుమారు 30 నిమిషాల పాటు నిలబడి వేచి చూశానని నిందితుడు చెప్పినట్లు పేర్కొన్నారు. ‘‘సిద్ధిఖీపై కాల్పులు జరిగిన వెంటనే చొక్కా మార్చుకొని.. ఆసుపత్రి బయట 30 నిమిషాల పాటు జనం మధ్య నిలబడి ఉన్నా. సిద్ధిఖీ పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలిసిన వెంటనే వెళ్లిపోయా’’ అని నిందితుడు శివ కుమార్‌ పోలీసులకు తెలిపాడు.

అక్టోబర్ 12 రాత్రి 9:11 గంటలకు ముంబైలోని బాంద్రాలో  సిద్ధిఖీపై కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. ఆయన ఛాతీపై రెండు బుల్లెట్ గాయాలు తగలడంతో వెంటనే లీలావతి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. నిందితుల ప్రాథమిక ప్రణాళిక ప్రకారం.. ప్రధాన నిందితుడు శివకుమార్‌, అతని సహాయకులు ధర్మరాజ్ కశ్యప్, గుర్మైల్ సింగ్‌లను ఉజ్జయిని రైల్వే స్టేషన్‌లో కలవాల్సి ఉంది. అక్కడ బిష్ణోయ్ గ్రూప్‌ సభ్యుడు వారిని వైష్ణో దేవి వద్దకు తీసుకెళ్లాలి. అయితే..  కశ్యప్, సింగ్‌లు పోలీసులకు చిక్కడంతో వారి ప్లాన్ విఫలమైందని పోలీసులు తెలిపారు.

చదవండి: సిద్ధిఖీ కేసు: ‘కుదిరితే బాబా సిద్ధిఖీ.. లేకుంటే జీషన్ సిద్ధిఖీ’

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)