Breaking News

బాబా సిద్ధిఖీ హత్య కేసు: నిందితుడికి 7 రోజుల కస్టడీ

Published on Sun, 10/13/2024 - 19:58

ముంబై: ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ శనివారం హత్యకు గురయ్యారు. ఆయనపై జరిగిన కాల్పుల కేసులో నిందితుడు గుర్‌మైల్ సింగ్‌ను ముంబైలోని ఎస్ప్లానేడ్ కోర్టులో ఆదివారం హాజరుపర్చగా.. అక్టోబర్ 21 వరకు ముంబై క్రైమ్ బ్రాంచ్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. 

ఈ కేసులో నిందితులైన గుర్‌మైల్‌ సింగ్‌(23), ధర్మరాజ్‌ సింగ్‌ కశ్యప్(17)‌లను ముంబై పోలీసులు ఈరోజు ఉదయం ముంబైలోని ఎస్ప్లానేడ్ కోర్టులో హాజరుపరిచారు. ఎస్ప్లానేడ్ కోర్టు రెండో నిందితుడు మైనర్‌ కావటంతో ఆసిఫికేషన్ టెస్ట్ చేసిన తర్వాత మళ్లీ తమ ముందు హాజరుపర్చాలని ఆదేశించింది. ఆసిఫికేషన్ టెస్ట్ అనేది.. వ్యక్తి ఎముకలను ద్వారా వయస్సును అంచనా వేసే వైద్య పరీక్ష. ఇద్దరు నిందితులను పోలీసులు  ముంబై క్రైం బ్రాంచ్‌కు తరలించారు.

 

నిందితుల తరఫు న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడారు. ‘‘పోలీసులు నిందితుడిని ఈరోజు కోర్టులో హాజరుపర్చారు. మేము దానిని వ్యతిరేకించాం. కోర్టుకు ఇవ్వగలిగిన ఆధారాలను ఇచ్చాం. కోర్టు ఆ కారణాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని అక్టోబరు 21 వరకు కస్టడీ విధించింది. ఇక రెండో నిందితుడిని ఆసిఫికేషన్ టెస్ట్ తర్వాత మళ్లీ హాజరు పర్చాలని ఆదేశించింది. పోలీసులు 14 రోజుల కస్టడీకి అడిగారు. కానీ కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. తదుపరి విచారణ అవసరమని కోర్టు భావిస్తే కస్టడీని మరికొన్ని రోజులు  పెంచే అవకాశం ఉంది’ అని తెలిపారు.

ఇదిలా ఉండగా.. ఈ కేసుకు సంబంధించి మరో నిందితుడిని గుర్తించినట్లు ముంబై పోలీసులు తెలిపారు. నాలుగో నిందితుడి పేరు మహ్మద్ జీషన్ అక్తర్‌ అని వెల్లడించారు. ఇప్పటికే మూడో నిందితుడైన యూపీకి చెందిన శివకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

మరోవైపు.. బాబా సిద్ధిఖీ హత్య మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ముంబైలో శాంతిభద్రతల పరిస్థితిని దారుణం ఉందని..దానికి నిదర్శణమే బాబా హత్ అని మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేత విజయ్ వాడెట్టివార్‌ అన్నారు. నేరాల విషయంలో మహారాష్ట్ర.. ఉత్తరప్రదేశ్, బీహార్ మార్గంలో వెళుతుందని మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను రాజీనామా చేయాలని వాడెట్టివార్  డిమాండ్‌ చేశారు.

చదవండి:  బాబా సిద్ధిఖీ హత్య.. కేజ్రీవాల్‌ రియాక్షన్

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు