Breaking News

ఆటో డ్రైవర్ కొడుకు.. ఇకపై డాక్టర్ బాబు!

Published on Sat, 07/18/2026 - 08:50

గోరఖ్‌పూర్‌: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన 23 ఏళ్ల విశాల్ తివారీ ఆర్థిక ఇబ్బందులను అధిగమించి నీట్ పరీక్షలో 720కి 605 మార్కులు సాధించి తన పట్టుదలను నిరూపించుకున్నారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించే తండ్రి సంతోష్ తివారీ, గృహిణి అయిన తల్లి రాధికా తివారీ తమ కుమారుడి లక్ష్యం కోసం ఎంతగానో శ్రమించారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ విశాల్ చదువుకు ఆటంకం కలగకుండా చూశారు.

2022లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విశాల్, మొదట్లో స్వయంగా చదువుకున్నా విజయం దక్కలేదు. అనంతరం కుటుంబ సభ్యుల సహకారంతో కోచింగ్ తీసుకుని, నాలుగో ప్రయత్నంలో ఈ ఘనత సాధించారు. వివాహం జరిగి, ఒక కుమారుడు ఉన్నప్పటికీ బాధ్యతలను భుజాన వేసుకుని, మరోవైపు హోమ్ ట్యూషన్లు చెబుతూ చదువును కొనసాగించారు. ఉదయం కోచింగ్, సాయంత్రం ట్యూషన్లు, రాత్రి వరకు లైబ్రరీలో చదువుతూ విశాల్ కఠిన క్రమశిక్షణను పాటించారు. ఇంజనీర్ కావాలనుకున్న విశాల్, తన పెద్దనాన్న సలహాతో వైద్య వృత్తిని ఎంచుకున్నారు. ఇప్పుడు వైద్యుడిగా స్థిరపడి, తన తండ్రికి కారు కొనివ్వాలనేదే తన చిరకాల స్వప్నమని విశాల్ తెలిపారు. ఈ విజయం ఎంతో మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తోంది.

ఇది కూడా చదవండి: 15 నిమిషాల ఓవర్‌టైమ్‌కీ డబ్బులిచ్చే వింత దేశం!

#

Tags : 1

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)