శుభాంశు వచ్చేశాడు 

Published on Sun, 08/17/2025 - 07:07

న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో పాదం మోపిన తొలి భారతీయునిగా సరికొత్త చరిత్ర సృష్టించిన వాయుసేన గ్రూప్‌ కెప్టెన్, వ్యోమగామి శుభాంశు శుక్లా స్వదేశానికి చేరుకున్నారు. శనివారం అర్ధరాత్రి రెండు గంటలు దాటాక ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్లా భార్య కామ్నా, కుమారుడు కియష్‌తో పాటు అసంఖ్యాకులైన అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ విజ్ఞాన మంత్రి జితేంద్ర సింగ్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, ఇస్రో ఛైర్మన్‌ వి.నారాయణన్, పలువురు ఉన్నతాధికారులు ఎదురెళ్లి మరీ కరతాళ ధ్వనుల మధ్య శుభాంశును విమానాశ్రయం నుంచి బయటకు తీసుకొచ్చారు. 

త్రివర్ణ పతాకాలను చేబూని నినాదాలతో హోరెత్తించిన అభిమానులకు ఆయన చిరునవ్వుతో అభివాదం చేశారు. డప్పుచప్పుళ్లు, జయజయధ్వానాలతో పండుగ వాతావరణం నెలకొంది. ‘‘స్వదేశానికి తిరిగిరావడం ఎంతో సంతోషంగా ఉంది. మీరంతా ఇంతటి సాదర స్వాగతం పలకినందుకు కృతజ్ఞతలు’’ అని కేంద్ర మంత్రిని ఉద్దేశిస్తూ శుక్లా ‘ఎక్స్‌’లో పోస్ట్‌ పెట్టారు. యాగ్జియం–4 మిషన్‌లో భాగంగా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి శుభాంశు జూన్‌ 25న అంతరిక్షంలోకి వెళ్లడం, ఆ మర్నాడు ఐఎస్‌ఎస్‌కు చేరుకోవడం తెలిసిందే. అక్కడ 18 రోజులపాటు ఆయన 20 ప్రత్యేక కార్యక్రమాలు, 60కి పైగా ప్రయోగాలుచేశారు. 

జూలై 15న భూమికి చేరుకున్నారు. నాసా క్వారంటైన్‌లో గడిపి తాజాగా స్వదేశం చేరారు. శుభాంశు సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. అనంతరం సొంతూరు లఖ్‌నవూ వెళ్తారు. తర్వాత 22, 23వ తేదీల్లో ఢిల్లీలో జాతీయ అంతరిక్ష దినోత్సవాలో పాల్గొంటారు. శుభాంశు దిగ్విజయ అంతరిక్ష యాత్రపై సోమవారం లోక్‌సభలో ప్రత్యేక చర్చ జరగనుంది. 

Videos

30 వేల పెన్షన్ రావాల్సింది.. 13 వేలు ఇస్తున్నారు

మెటా తో లోకేష్ కుమ్మక్కు... సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్...

తలుపులేసుకుని తొడకొట్టే హీరో... మొత్తం గీసుకొని మీసం మెలేసే మొనగాడు..!

నడుములోతు నీళ్లలో లగ్గం.. వరదైనా తగ్గేదేలే అంటున్న జంట

చరిత్ర సృష్టించిన రష్మిక

DSCలో అవినీతి బట్టబయలు..! లోకేష్ రాజీనామా..?

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

Photos

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)