Breaking News

బెంగళూరు రోడ్లపై శుభాన్షు శుక్లా సెటైర్లు

Published on Fri, 11/21/2025 - 10:40

బెంగళూరు: ఇటీవలి కాలంలో బెంగళూరులో పరిస్థితులపై పలువురు ప్రముఖులు కామెంట్స్‌ చేయడం సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీసింది. తాజాగా బెంగళూరు రోడ్ల పరిస్థితిపై వ్యోమగామి శుభాన్షు శుక్లా సైతం సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. సిటీలో ప్రయాణం చేయాడం నరకమే అనే విధంగా పరోక్షంగా వ్యాఖ్యానించారు.

వ్యోమగామి శుభాన్షు శుక్లా గురువారం బెంగళూరు టెక్నాలజీ సమ్మిట్‌ (బీటీఎస్‌)లో ‘ఫ్యూచర్‌ మేకర్స్‌ కాంక్లేవ్‌’కు హాజరయ్యారు. ఈ సందర్బంగా శుక్లా మాట్లాడారు. అంతరిక్షంలో అడుగుపెట్టాక మన గుండెపై మోటారు వాహనం ప్రయాణించినట్లు ఉంటుంది. అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు కనీసం వారం రోజులు పడుతుంది. భూమికి వచ్చాక రెండు వారాలపాటు మన శరీరం అదుపు తప్పే ఉంటుందని తన అనుభవాన్ని వివరించారు. ఈ ప్రయాణం భారతీయ అంతరిక్ష విజయానికి ప్రతీక అని తెలిశాక గర్వంగా ఉందన్నారు. అంతరిక్షం నుంచి భారత్‌ ఎలా కనపడుతుందో వీడియో రూపంలో చూపారు.

ఇక, ఇదే సమయంలో బెంగళూరులో ట్రాఫిక్‌ పరిస్థితిని వివరిస్తూ.. అంతరిక్షయానంపై తాను చేసే ప్రసంగ సమయంతో పోలిస్తే బెంగళూరు రహదారులపై ప్రయాణం మూడు రెట్లు అధికమని వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా మారతహళ్లి నుంచి మూడు గంటలపాటు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఇందులో మూడో వంతు సమయంలోనే తాను ప్రసంగాన్ని పూర్తి చేశానన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. అంతకుముందు బెంగళూరులోని అధ్వానపు రోడ్ల సమస్యపై బయోకాన్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్-షా, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య నడుస్తున్న మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. కిరణ్ మజుందార్-షా వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఘాటుగా స్పందిస్తూ, "ఆమె తన మూలాలను మరచిపోయారని", దీని వెనుక "వ్యక్తిగత అజెండా" ఉందని ఆరోపించారు. అయితే, షా ఈ ఆరోపణలను ఖండించారు. అనంతరం ఆమె రోడ్ల అభివృద్ధికి నిధులు ఇస్తానని ప్రకటించగా, దానికి డీకే శివకుమార్ సానుకూలంగా స్పందించారు. ఆమె ఏ రోడ్లను అభివృద్ధి చేయాలనుకున్నా ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)