Breaking News

యూపీ అసెంబ్లీ ఉప ఎన్నికలు: అభ్యర్థులను ప్రకటించిన మాయావతి, ఆజాద్‌

Published on Mon, 08/19/2024 - 12:55

ఉత్తరప్రదేశ్‌లోని పది అసెంబ్లీ స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో బీఎస్పీ, చంద్రశేఖర్ ఆజాద్ పార్టీ ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొననున్నదనే మాట వినిపిస్తోంది. చాలా కాలం తర్వాత ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని బీఎస్పీ నిర్ణయించుకుంది. లోక్‌సభలో విజయం సాధించిన చంద్రశేఖర్ ఆజాద్  ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల పోరులోకి దూకారు. ఇప్పటి వరకూ మాయావతి రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా, ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) మూడు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది.

ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) ఘజియాబాద్ సదర్ స్థానం నుండి చౌదరి సత్పాల్, ముజఫర్‌నగర్‌లోని మీరాపూర్ స్థానం నుండి జాహిద్ హసన్, మీర్జాపూర్‌లోని మజ్వాన్ స్థానం నుండి ధీరజ్ మౌర్యలను  ఎన్నికల బరిలోకి దించినట్లు ప్రకటించింది. మిగిలిన ఏడు స్థానాల్లో పోటీకి దిగే అభ్యర్థుల పేర్లను త్వరలో ప్రకటిస్తామని పార్టీ తెలిపింది.

ఇక బీఎస్పీ విషయానికొస్తే మిల్కిపూర్, మిరాపూర్ నుండి పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటించింది. మిల్కీపూర్ టిక్కెట్‌ను రామ్ గోపాల్ కోరికి ఇవ్వగా, మీరాపూర్ నుండి చంద్రశేఖర్ ఆజాద్‌కు సన్నిహితుడైన షా నాజర్‌ను అభ్యర్థిగా నిలబెట్టారు. షా నాజర్ ప్రస్తుతం బీఎస్పీ జిల్లా పంచాయతీ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆయన చంద్రశేఖర్ ఆజాద్ పార్టీలో సభ్యునిగా ఉన్నారు. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)