Breaking News

‘భార్యాపిల్లలను వివాదాల్లోకి లాగుతారా?’.. సీఎంపై ప్రియాంక ఆగ్రహం

Published on Fri, 02/20/2026 - 12:29

గౌహతి: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్‌కు పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయంటూ ముఖ్యమంత్రి చేస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు. రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు సహజమని, అయితే ఒక నాయకుడి భార్యను, పిల్లలను ఇటువంటి వివాదాల్లోకి లాగడం అత్యంత దుర్మార్గమైన రాజకీయమని ఆమె మండిపడ్డారు.

గౌరవ్ గొగోయ్‌ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుంటూ కుటుంబ సభ్యులను వేధించడం సరికాదని ప్రియాంక పేర్కొన్నారు. రాజకీయ నేతలు రెండు రకాలుగా ఉంటారని, ఒకరు అభివృద్ధి, సానుకూలతను కోరుకునే వారైతే, మరొకరు కేవలం విభజన రాజకీయాలకు పాల్పడతారని ప్రియాంక వ్యాఖ్యానించారు. గౌరవ్ గొగోయ్ ఎప్పుడూ సానుకూల రాజకీయాలనే నమ్ముకున్నారని, అందుకే ఆయనపై ఇటువంటి దాడులు జరుగుతున్నాయని ఆమె  ఆరోపించారు. అయితే అస్సాం ప్రజలకు అంతా తెలుసని, గొగోయ్ ఎదుగుదలను ఓర్వలేకనే బీజేపీ నేతలు ఈ స్థాయికి దిగజారుతున్నారని ఆమె విమర్శించారు.

ముఖ్యమంత్రి అనవసర విమర్శలు మానుకుని రాష్ట్రంలోని ప్రధాన సమస్యలపై దృష్టి సారించాలని ప్రియాంక గాంధీ హితవు పలికారు. అస్సాం యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని, రాష్ట్రంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆమె గుర్తుచేశారు. రాష్ట్రంలో భారీగా అవినీతి జరుగుతోందని, ప్రజలను నమ్మించి మోసం చేయడమే ప్రస్తుత ప్రభుత్వ ధ్యేయంగా మారిందని ఆమె ఆరోపించారు. వివాదాస్పద వ్యాఖ్యలను పక్కన పెట్టి, రాష్ట్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి మాట్లాడాలని ఆమె డిమాండ్ చేశారు.

గౌహతి శివార్లలోని సోనాపూర్ వద్ద  గాయకుడు జుబీన్ గార్గ్ స్మారక చిహ్నం ‘జుబీన్ క్షేత్ర’ను సందర్శించి ప్రియాంక గాంధీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జుబీన్ గార్గ్ రాజకీయాలకు అతీతమైన వ్యక్తి అని, తన జీవితాంతం ప్రేమ అనే సందేశాన్ని సమాజానికి అందించారని కొనియాడారు. ఆయన అంత్యక్రియలు జరిగిన ప్రదేశం పవిత్రమైనదని, అటువంటి స్థలాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని, తాను కేవలం ఒక సామాన్యురాలిగా గౌరవప్రదంగా నివాళులర్పించడానికి మాత్రమే వచ్చానని ఆమె స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: ‘ప్యాక్స్ సిలికా’లోకి భారత్.. ఇక ఏఐలో మనదే హవా..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)