Breaking News

ఏడేళ్లకే 12 భాషలు : కుమార్తె పెంపకంలో హీరోయిన్‌ స్పెషాల్టీ ఇదే!

Published on Mon, 10/26/2026 - 16:47

ప్రముఖ   హీరోయిన్‌  అసిన్‌ (అసిన్ తోట్టుంకల్) గురించి తెలుగు సినీ ప్రేమికులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. నేడు (అక్టోబర్ 26న)  41వ వసంతంలోకి అడుగు పెట్టారు.  అలాగే అక్టోబర్ 23న ఆమె కుమార్తెకు తొమ్మిదేళ్లు నిండాయి. సౌత్‌తోపాటు బాలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా  గుర్తింపు తెచ్చుకున్నారామె. కరియర్‌పీక్‌లో ఉండగానే  2016లో  మైక్రోమాక్స్ (Micromax) సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ ( (Rahul Sharma)ను వివాహం చేసుకున్నారు.పెళ్లి తరువాత  యాక్టింగ్‌ దూరమయ్యారు. తాజాగా అసిన్‌ రాహుల్‌ దంపతుల  ఏకైక కుమార్తె అరిన్ రేన్‌  శర్మ కు సంబంధించిన అంశం నెట్టింట వైరల్‌గా మారింది.  

భార్య అసిన్‌పై రాహుల్ శర్మ ప్రశంసలు!
ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఉటంకించిన ప్రకారం, జూలై 2025లో మైగవ్ ఇండియా  (MyGov India)కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాహుల్ శర్మ తన భార్య అసిన్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తమ పాపం పెంపకానికి సంబంధించిన  కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి చెప్పుకొచ్చారు.  అసిన్‌ను పెళ్లి చేసుకోవడమే నా జీవితంలో జరిగిన అత్యంత ముఖ్యమైన విషయమనీ, తన జీవితంలోని ప్రతి దశలో ఆమె తనకు  ఎంతో  అండగా నిలిచిందని చెప్పారు. అలాగే  ఎలాంటి కష్టం వచ్చినా 'ఏమీ పర్వాలేదు.. ముందుకు సాగు' అని ధైర్యం చెప్తుందని తెలిపారు.  జీవిత భాగస్వామి మనల్ని వెనక్కి లాగేలా కాకుండా, పైకి లేపేలా ఉండాలి.  తనకు అసిన్  అలాంటి పార్టనరే. తన జీవితంలో ఆమె పాత్రను మాటల్లో చెప్పలేనని ఆమెపై  ప్రశంసలు కురిపించారు.

   12 భాషలలో నైపుణ్యం:   నో  స్క్రీన్ టైమ్ అలాగే తమ కుమార్తె అరిన్  ఏడేళ్ల  వయస్సులోనే (ఈ ఏడాది ఆమెకు 9 ఏళ్లు వచ్చాయి) కొరియన్, జపనీస్, థాయ్, చైనీస్ తో సహా దాదాపు 12 భాషల్లో మాట్లాడుతుందనీ,  స్టడీస్‌లో  టాప్‌లో  ఉందని రాహుల్‌ సంతోషాంగా చెప్పుకొచ్చారు. అరిన్‌కు ఇప్పటివరకు టీవీ గానీ, మొబైల్ ఫోన్లు గానీ ఇవ్వలేదు. కేవలం పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉండేలా అసిన్‌ జాగ్రత్త పడిందన్నారు. బహుశా అరిన్ పాఠశాలలో ఉన్న పుస్తకాల కంటే తమ ఇంట్లోనే ఎక్కువ పుస్తకాలు ఉంటాయని  పేర్కొన్నారు. అరిన్ 2వ తరగతి చదువుతున్నప్పటికీ, ఇంట్లో 8, 9 తరగతుల పుస్తకాలు అందుబాటులో ఉంచడంతోపాటు,ఇపుడే 10వ తరగతి బోర్డు పరీక్షలు కూడా రాయిం చేయ వచ్చని రాహుల్ సరదాగా వ్యాఖ్యానించారు. ఇలాంటి పెంపకం  అసిన్ వల్లే సాధ్యమైందన్నారు.

ఇదీ చదవండి: 1600 మీటర్లలో గెలుపు : ఉద్యోగం పందెంలో కవితకు ఓటమి

జపాన్‌లో 9వ పుట్టినరోజు వేడుకలు
అరిన్ రేన్, అక్టోబర్ 23న తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది. జపాన్‌లో జరుపుకున్న పుట్టినరోజు వేడుకల ఫోటోలను అసిన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకున్నారు. జపాన్ పర్యటనలో భాగంగా, అరిన్ కిమోనో దుస్తుల్లో కనిపించింది. అక్కడ ఆమె జపనీస్ సంస్కృతిని తెలుసుకోవడంతో పాటు, నింజా విన్యాసాలను కూడా నేర్చుకుంది. అంతేకాకుండా, సుమో రెజ్లర్లతో కలిసి ఫోటోలకు పోజులిచ్చింది.

కాగా 2020లో తన కుమార్తె మూడవ పుట్టినరోజు సందర్భంగా, ఆమె పేరు వెనుక ఉన్న అర్థాన్ని అసిన్ వెల్లడించారు 'అరిన్ రేన్' (Arin Rayn) అనే పేరును ఆమె తల్లిదండ్రుల పేర్లైన రాహుల్ ,అసిన్ పేర్ల కలయికతో రూపొందించారు. 'రేన్' (Rayn) అనే పదాన్ని 'రా-ఇన్' (Ra-in) అని పలకాలని. ఈ పేరు చిన్నగా, సరళంగా, లింగ భేదం లేనిదిగా (gender-neutral) ఉంటుందని  స్వయంగా అసిన్‌ వెల్లడించారు. అంతేకాకుండా, ఈ పేరు మతం, కులం లేదా పితృస్వామ్య భావనలకు అతీతంగా ఉండాలని ఆశిస్తున్నామన్నారు. కాగా గజిని,  శివమణి, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, ఘర్షణ, లక్ష్మీ నరసింహ లాంటి సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌ మనసు దోచుకున్న అసిన్ చివరిసారిగా 2015లో వచ్చిన 'ఆల్ ఈజ్ వెల్' (All Is Well) కనిపించారు.

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)