Breaking News

ఉరి, పుల్వామా కంటే ఘోరమైన దాడి ఇది: ఒవైసీ

Published on Wed, 04/23/2025 - 16:03

న్యూఢిల్లీ: ఉరి, పుల్వామాలలో జరిగిన దాడుల కంటే.. జమ్ము కశ్మీర్‌ పహల్గాం(Pahalgam)లో తాజాగా జరిగిన ఉగ్ర దాడి అత్యంత ఘోరమైందని, అది తనను ఎంతగానో బాధించిందని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ(Asaduddin Owaisi)  అన్నారు. నిఘా వ్యవస్థ వైఫల్యం వల్లే దాడి జరిగిందన్న ఆయన.. ఘటనకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.

‘‘పహల్గాంలో.. మతం ఏంటని అడిగిన తర్వాతే ఉగ్రవాదులు అమాయక ప్రజలను విచక్షణారహితంగా చంపారు. ఇది గతంలో జరిగిన ఉరి, పుల్వామా ఉగ్రదాడుల కంటే ఘోరమైంది. ఈ దాడిని మేం ఖండిస్తున్నాం. ఇది కచ్చితంగా నిఘా వ్యవస్థ వైఫల్యమే. జమ్ములో ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరోధక విధానం పనిచేస్తుందో లేదో పరిశీలించుకోవాలి. ఈ ప్రభుత్వం ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పి.. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తుందని ఆశిస్తున్నాం’’ అని విలేకరులతో అన్నారాయన.

దక్షిణ జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాంలోని బైసరన్‌ లోయలో ఘోరం జరిగింది. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు.. మైదానంలో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతున్న పర్యాటకులను చుట్టుముట్టి తుపాకులతో దారుణంగా కాల్చి చంపారు. ఐడీ కార్డులను పరిశీలించి.. పేరు, మతం ఆధారంగా వేరు చేసి మరీ దాడి చేశారు. 

ఈ దాడిలో 26 మంది అక్కడికక్కడే మరణించగా.. తీవ్రంగా గాయపడి మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్లలో ఇద్దరు తాజాగా మరణించడంతో మృతుల సంఖ్య 28కి చేరింది. అయితే.. బాడీ కేమ్‌ ద్వారా దాడి దృశ్యాలను పాక్‌లోని తమ హ్యాండర్లకు ఉగ్రవాదులు చేరవేసినట్లు భద్రతా సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఉగ్రవాదుల ఫొటోలు, ఊహా చిత్రాలు విడుదల చేసి.. జమ్ము వ్యాప్తంగా గాలింపు కొనసాగిస్తోంది.

Asaduddin Owaisi:  పహల్గాంలో దాడికి పాల్పడిన ఉగ్రమూకకు గుణపాఠం చెప్పాలి

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)