Breaking News

బీజేపీతో పొత్తుపై అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు

Published on Tue, 01/20/2026 - 17:51

ఇటీవల మహారాష్ట్రలో ఓ మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానం కోసం బీజేపీ, ఎంఐఎం పార్టీలు కలవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే ఆ ఘటనపై తాజాగా  అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఎంఐఎం పార్టీ ఎట్టిపరిస్థితుల్లో బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. సముద్రం లోని రెండు చివరలు ఎప్పటికీ కలవవు అని తెలిపారు.

కొద్దిరోజుల క్రితం మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం జరిగింది. అక్కడి అకోట్ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్ స్థానం కోసం బద్రశత్రువులైన బీజేపీ, ఎంఐఎం పార్టీలు పొత్తుపెట్టుకున్నాయి.  అధికారం కోసం ఉప్పునిప్పులా ఉన్న రెండు పార్టీలు కలవడమేంటని ముక్కున వేలేసుకున్నారు. అయితే దీనిని ఆరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. అది తనకు తెలియకుండా జరిగిందని అలా పొత్తు పెట్టుకున్న నాయకులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

తాజాగా ఈ అంశంపై అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. "అకోలాలో ఎంఐఎం కార్పొరేటర్లు ఐదుగురు గెలిచారు. అయితే అధికారం కోసం ఒక గ్రూపుకు మద్దతిస్తామన్నారు. అయితే ఆ గ్రూపు బీజేపీతో కలిసి ఉన్న సంగతి వారికి తెలియదు. అయితే ఆగ్రూపులో బీజేపీ ఉన్న సంగతి తెలిసిన తర్వాత సపోర్టును ఉపసంహరించుకోవాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్‌కు లేఖ రాయాలని కోరాం" అని ఒవైసీ అన్నారు

బీజేపీ, ఎంఐఎం పార్టీలు విభిన్న ధృవాలని సముద్రానికి ఉన్న రెండు తీరాల్లాంటివారని అవి ఎప్పటికీ కలవవని ఒవైసీ తేల్చిచెప్పారు. అంతేకాకుండా తమ పార్టీకి చెందిన నెతలేవరైనా  పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పొత్తు పెట్టుకుంటే అధిష్ఠానం వారిపై చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఇటీవల మహాయుతి కూటమి ఆఫర్ చేసిన కోఆప్షన్ మెంబర్ తీసుకున్న ఇంతియాజ్ జలీల్ అనే వ్యక్తిని పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు ఒవైసీ పేర్కొన్నారు.

కాగా ఇటీవల జరిగిన మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో  ఎంఐఎం పార్టీ సత్తా చాటింది. మున్సిఫల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 125 సీట్లు గెలిచిన ఆపార్టీ  గత నెలలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో 85 సీట్లు సాధించింది. దీంతో మహారాష్ట్రలో ఎంఐఎం పార్టీకి చెందిన కార్పొరేటర్లు 200మంది ఉన్నట్లు అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. 2017లో జరిగిన ఎ‍న్నికల్లో81 కార్పొరేటర్ స్థానాలు సాధించిన ఎంఐఎం ఈ సారి వాటి సంఖ్య 200కు పెంచుకుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)