Breaking News

ఢిల్లీని నాశనం చేస్తారా?.. సునీతా కేజ్రీవాల్‌

Published on Wed, 03/27/2024 - 12:34

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రజలను నీటి కష్టాల పాలు చేస్తారా? ఢిల్లీని నాశనం చేస్తారా? అని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ భార్య సునీతా కేజ్రీవాల్‌ అన్నారు. తాగునీటి సమస్యలపై సంబంధిత మంత్రికి సీఎం కేజ్రీవాల్ లేఖ రాస్తే దానిపై కేసులు వేశారని మండపడ్డారామె. బుధావారం సునీతా కేజ్రీవాల్‌ ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. 

‘రెండు రోజుల క్రితం సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌  తాగునీటి సమస్యలకు సంబంధించి మంత్రి  అతిశీకి ఆదేశాల లేఖ పంపారు. వాటి మీద కేంద్ర ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఢిల్లీని నాశనం చేస్తారా? ఢిల్లీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తారా? ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్రంగా బాధపడుతున్నారు. ఇప్పటి వరకు ఈడీ 250 సోదాలు జరిపింది.

ఈడీ అధికారులు లిక్కర్‌ స్కామ్‌ డబ్బు కోసం సోదాలు చేశారు. కానీ వారికి తమ వద్ద ఎటువంటి డబ్బు లభించలేదు. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మార్చి 28(గురువారం) అన్ని విషయాలు బయటపెడతారు. లిక్కర్‌ స్కామ్‌ డబ్బు ఎక్కడ ఉందో కూడా చెబుతారు. వాటికి సంబంధించి కేజ్రీవాల్‌ ఆధారాలు కూడా సమర్పిస్తారు’ అని సునిత కేజ్రీవాల్‌ తెలిపారు. సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌ అయిన తర్వాత రెండోసారి ఆమె ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడారు.

ఇక.. మర్చి 21న సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఈడీ  అరెస్ట్‌ చేసింది. అనంతరం ఆయన్ను ఈడీ.. కోర్టు ముందు హాజరుపరిచి కస్టడీకి కోరింది. దీంతో అరవింద్‌ కేజ్రీవాల్‌ను మార్చి 28 వరకు కోర్టు.. ఈడీ కస్టడీకి అప్పగించింది. ఇక..ఈడీ లాకప్‌ నుంచి అరవింద్‌ కేజ్రీవాల్‌ పరిపాలన కొనసాగిస్తూ.. ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీనిపై బీజేపీ మండిపడుతూ.. సీఎంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తోంది

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)