Breaking News

ముందు మీ దేశం సంగతి చూసుకోండి: కేజ్రీవాల్‌ స్ట్రాంగ్‌ రిప్లై

Published on Sat, 05/25/2024 - 15:57

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు, భారత్‌లో ప్రస్తుత రాజకీయాలపై జోక్యం చేసుకున్న పాకిస్థాన్‌ మాజీ మంత్రికి ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఘాటు రిప్లై ఇచ్చారు. మా వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా మీ దేశం సంగతి మీరు చూసుకోండని చురకంటించారు. మీ సపోర్ట్‌ ఏమీ  అవసరం లేదని తిప్పికొట్టారు. 

లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్‌లో భాగంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీలో శనివారం(మే25) కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. అనంతరం ఓటు వేసిన ఫొటోను తన ఎక్స్‌(ట్విటర్‌) ఖాతాలో షేర్‌ చేశారు. కేజ్రీవాల్‌ చేసిన ఈ పోస్ట్‌ను పాకిస్థాన్‌ మాజీ మంత్రి, ఎంపీ చౌధరి ఫహద్‌ హుస్సేన్‌ రీపోస్ట్‌ చేశారు.

ద్వేషం, అతివాద భావజాలంపై శాంతి, సామరస్యం విజయం సాధించాలని కామెంట్‌ను జత చేశారు. ఇండియా ఎలక్షన్స్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌ పెట్టారు. చౌధరి కామెంట్లకు అరవింద్‌ కేజ్రీవాల్ తిరిగి వెంటనే స్పందించారు.

‘చౌధరి సాహిబ్‌ మా దేశంలో సమస్యలను నేను, నా దేశ ప్రజలు పరిష్కరించుకోగలం. ఇందుకు మీ సలహాలు మాకు అక్కర్లేదు. అసలే మీ దేశం పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. ముందు ఆ పని చూడండి. భారత్‌లో ఎన్నికలు పూర్తిగా మా అంతర్గత వ్యవహారం. మీ జోక్యాన్ని మా దేశం ఏమాత్రం సహించదు’అని కేజ్రీవాల్‌ పోస్ట్‌ చేశారు. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)