Breaking News

Liquor Case: సుప్రీం కోర్టులో ఎమర్జెన్సీ పిటిషన్‌

Published on Wed, 04/10/2024 - 09:07

న్యూఢిల్లీ, సాక్షి: లిక్కర్‌ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇవాళ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. తన అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. దీంతో సర్వోన్నత న్యాయస్థానంలో ఆయన ఈ ఉదయం అత్యవసర పిటిషన్‌ వేయబోనున్నట్లు సమాచారం. 

బుధవారం ఉదయం కోర్టు ప్రారంభం కాగానే చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ముందు ఈ పిటిషన్‌ను స్పెషల్‌ మెన్షన్‌ చేయాలని, అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరేందుకు కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాది సిద్ధమయ్యారు. దీంతో సుప్రీం విచారణకు స్వీకరిస్తుందా? లేదా? అనే ఉత్కంఠ ఆప్‌ శ్రేణుల్లో నెలకొంది.

లిక్కర్‌ స్కాం కేసులో మనీలాండరింగ్‌ అభియోగాలపై మార్చి 21వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసింది. అయితే ఆ సమయంలోనే ఆయన సుప్రీం కోర్టులో తన అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ ఓ పిటిషన్‌ వేశారు. అయితే ఢిల్లీ హైకోర్టు, రౌస్‌ అవెన్యూ కోర్టుల్లో పిటిషన్లు పెండింగ్‌లో ఉండడం, కింది కోర్టుల్లో విచారణతో క్లాష్‌ అయ్యే అవకాశం ఉండడంతో ఆ టైంలో ఆయన ఆ పిటిషన్‌ వెనక్కి తీసుకున్నారు. 

ఇక.. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్‌ అసలైన సూత్రధారిగా ఈడీ ఆరోపిస్తోంది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఈడీ తమ కస్టడీకి తీసుకొని విచారించగా.. ఏప్రిల్‌ 15 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం ఆయన తీహార్‌ జైలులో ఉన్నారు. 

అరెస్ట్‌ చట్టవిరుద్ధం కాదు
కేజ్రీవాల్‌ అరెస్టుకు ఈడీ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని పిటిషన్‌పై విచారణ సందర్భంగా  ఢిల్లీ హైకోర్టు జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం పేర్కొంది. హవాలా ద్వారా డబ్బు తరలింపుపై ఈడీ ఆధారాలు చూపించిందని, గోవా ఎన్నికలకు డబ్బు ఇచ్చినట్లు అప్రూవర్‌ చెప్పారని న్యాయస్థానం పేర్కొంది. కేజ్రీవాల్‌ అరెస్టు, రిమాండ్‌ చట్టవిరుద్ధం కాదని వ్యాఖ్యానించింది.

‘‘సీఎంకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం ఉండదు. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేమీ ఉండవు. విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనవసరం లేదు. నిందితుడి వీలును బట్టి విచారణ జరపడం సాధ్యం కాదు’’ అని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)

+5

కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)