Breaking News

బైకర్‌పై దూకి.. లాక్కెల్లి చంపిన పెద్దపులి

Published on Fri, 02/06/2026 - 16:15

అరుణాచల్ ప్రదేశ్‌లో అరుదైన విషాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఓ హెడ్‌ కానిస్టేబుల్‌పై పెద్దపులి దాడి చేసి ప్రాణం తీసింది. అయితే ఈ ఘటన జరిగిన రెండ్రోజులకే ఓ పులి అనూహ్యంగా తుపాకీ తూటా గాయంతో చనిపోయిన స్థితిలో కనిపించింది. దీంతో ఇది కానిస్టేబుల్‌ మరణానికి ప్రతీకార దాడినా? లేదంటే వేటగాళ్ల పనా? అనే అనుమానాలు తలెత్తాయి. 

అరుణాచల్ ప్రదేశ్ పోలీస్‌ విభాగంలో చిక్సెంగ్‌ మాన్‌పుంగ్‌ రేడియో ఆపరేటర్‌గా విధులు నిర్వహించాడు. లోయర్ దిబాంగ్ వ్యాలీ జిల్లా మయోడియాలో ఆయన డ్యూటీ నిర్వహించేవాడు. ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం అనిని నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో.. రోయింగ్ రహదారిపై ఘోరం జరిగింది. బైక్‌పై వెళ్తున్న టైంలో ఓ పెద్దపులి హఠాత్తుగా ఆయనపై దాడి చేసింది. 

ఆ దారిన వెళ్లే వాహనదారులు.. రోడ్డు పక్కన బైక్‌ పడి ఉండడం చూసి యాక్సిడెంట్‌ కావొచ్చని పట్టించుకోకుండా వెళ్లిపోయారు. తెల్లవారి అటుగా వెళ్లిన వాళ్లకు.. పక్కన పొదల్లో రక్తపు మడుగులో ఆయన మృతదేహం కనిపించింది. వాళ్లు పోలీసులకు సమాచారం అందించగా.. అది పెద్దపులి చేసిన దాడిగా నిర్ధారించుకున్నారు. చిక్సెంగ్‌ మరణంతో పోలీస్‌ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. 

ఈ ఘటన తర్వాత అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఓ ఆడపులి మూడు కూనలతో ఆ ప్రాంతంలో సంచరిస్తుందని గుర్తించారు. కూనల్ని రక్షించుకునే క్రమంలోనే అది దాడి చేసి చంపి ఉంటుందని భావించారు. అరుణాచల్ ప్రదేశ్‌లో మనుషులపై పులులు దాడులు చేయడం అత్యంత అరుదు. దీంతో స్థానిక ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించింది. 
 

 
ఈ ఘటనతో మయోడియా ప్రాంతంలో రాత్రి పూట ద్విచక్ర ప్రయాణాలపై నిషేధం విధించారు. అయితే.. రెండు రోజుల తర్వాత అదే ప్రాంతంలో ఒక పులి మృతదేహం తుపాకీ గాయాలతో కనుగొన్నారు. ఇది ప్రతీకార చర్య కావచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. అదే సమయంలో వేటగాళ్ల దాడి అయ్యి ఉండొచ్చన్న కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు.

ఈ మధ్యకాలంలో మయోడియా–మెహావో వన్యప్రాణి సంరక్షణ ప్రాంతం పరిసరాల్లో పులుల సంచారం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. అయితే.. చిక్సెంగ్‌ మాన్‌పుంగ్‌ను చంపింది చనిపోయిన పులినేనా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. 

మరోవైపు.. సోషల్ మీడియాలో రోడ్డు మీద పులులు రాత్రి పూట సంచరించడం, వాహనాలను వెంబడించడం వైరల్‌ అవుతోంది. బైకర్ల మీదకు పులి దూకిన వీడియోను చిక్సెంగ్‌ మాన్‌పుంగ్‌ దాడి వీడియో అంటూ వైరల్‌ చేస్తున్నారు. అటుగా ఓ వాహనంలో వెళ్లే వాళ్లు ఆ వీడియో తీసినట్లు ప్రచారం చేస్తున్నారు. అయితే అధికారులు ఇవేం అధికారిక వీడియోలు అని చెప్పడం లేదు.  వైరల్ అవుతున్న పులి వీడియోలు ఏఐవి కావని.. వేరే సందర్భాల్లో తీసినవని తెలుస్తోంది.  

 

 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)