Breaking News

అంబేడ్కర్‌ ఆశయం ‘ఒకే దేశం.. ఒకే రాజ్యాంగం’

Published on Sun, 06/29/2025 - 03:09

నాగపూర్‌: దేశాన్ని ఐక్యంగా ఉంచాలంటే ఒక్కటే రాజ్యాంగం అమల్లో ఉండాలని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ నిర్దేశించారని, ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రాజ్యాంగం అనే ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ చెప్పారు. ఆయన ఆశయం ఒకే దేశం.. ఒకే రాజ్యాంగం అని స్పష్టంచేశారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో శనివారం ‘రాజ్యాంగ ప్రవేశిక ఉద్యానవనాన్ని’ జస్టిస్‌ గవాయ్‌ ప్రారంభించారు. 

అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ ఐక్యతకు ఏకైక రాజ్యాంగం అనే అంబేడ్కర్‌ దార్శనికత నుంచి సుప్రీంకోర్టు స్ఫూర్తి పొందిందని, అందుకే ఆర్టీకల్‌ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిందని తెలిపారు. 

ఈ ఆర్టీకల్‌ రద్దును సమర్థించిన ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్‌ గవాయ్‌ సైతం ఉన్న సంగతి తెలిసిందే. ఆర్టీకల్‌ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు తమ ముందుకు వచ్చినప్పుడు అంబేడ్కర్‌ మాటలు గుర్తుచేసుకున్నానని జస్టిస్‌ గవాయ్‌ చెప్పారు. దేశానికి ఒక్కటే రాజ్యాంగం ఉండాలన్న అంబేడ్కర్‌ బాటను అనుసరిస్తూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.  

ఎన్ని సవాళ్లు ఎదురైనా ఐక్య భారత్‌  
రాజ్యాంగంలో సమాఖ్య లక్షణాలు అధికంగా ఉన్నట్లు అంబేడ్కర్‌పై అప్పట్లో విమర్శలు వచ్చాయని జస్టిస్‌ గవాయ్‌ గుర్తుచేశారు. యుద్ధాలు జరిగితే దేశం ఐక్యంగా ఉండలేదని, ముక్కలవుతుందని చాలామంది అనుమానించారని చెప్పారు. దేశాన్ని ఐక్యంగా ఉంచడంతోపాటు అన్ని రకాల సవాళ్లు సమర్థంగా ఎదుర్కోగల సత్తా రాజ్యాంగానికి ఉందని అంబేడ్కర్‌ బదులిచ్చారని పేర్కొన్నారు. 

పొరుగుదేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలో ఏం జరుగుతోందో చూడాలని, ఎన్ని సవాళ్లు ఎదురైనా మన దేశం మాత్రం దృఢంగా, ఐక్యంగానే ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సైతం ప్రసంగించారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే గొప్ప బహుమతులను రాజ్యాంగం రూపంలో అంబేడ్కర్‌ మనకు అందించారని కొనియాడారు. ప్రజాస్వామ్యంలోని నాలుగు మూలస్తంభాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ, మీడియా రంగాల బాధ్యతలు, హక్కులను రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిందని వెల్లడించారు.    

కొలీజియంపై పదవీ విరమణ తర్వాత మాట్లాడుతా.. 
ముంబై: న్యాయమూర్తులకు పదోన్నతులు, నియామకాలు, కొలీజియం తీసుకుంటున్న నిర్ణయాలపై పదవీ విరమణ (ఈ ఏడాది నవంబర్‌ 24) చేసిన తర్వాత వివరంగా మాట్లాడతానని సీజేఐ జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ చెప్పారు. ఇప్పుడు తనకున్న పరిమితుల దృష్ట్యా ఆయా అంశాలపై ఎక్కువగా స్పందించలేనని పేర్కొన్నారు. మనం కోరుకున్నట్లుగా ఏదీ జరగదని న్యాయమూర్తులు, న్యాయవాద వర్గాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లో అడ్వొకేట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బాంబే హైకోర్టు బెంచ్‌ ఆధ్వర్యంలో జస్టిస్‌ గవాయ్‌ని తాజాగా సన్మానించారు. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్‌ సంజయ్‌ వి.గంగాపూర్‌వాలాకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసే అవకాశం దక్కలేదని అన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సంజయ్‌ వి.గంగాపూర్‌వాలాను ఉద్దేశిస్తూ.. ‘‘సంజయ్‌ భాయ్‌.. సుప్రీంకోర్టుకు రాకపోవడం వల్ల మీరు నష్టపోయింది ఏమీ లేదు. సుప్రీంకోర్టే నష్టపోయింది. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను’’ అని పేర్కొన్నారు. 

సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి ఉద్దేశించిన కొలీజియంలో సభ్యుడిగా చేరినప్పటి నుంచి ప్రతిభకే పట్టం కట్టేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పారు. ప్రతిభ ఆధారంగా న్యాయమూర్తులను నియమించడానికి తపన పడుతున్నానని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో ఉన్న ఉత్తమమైన ప్రధాన న్యాయమూర్తులు సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులుగా రావాలన్నదే తన ఉద్దేశమని, అందుకోసం కొలీజియంలోని సహచర సభ్యులను ఒప్పిస్తుంటానని అన్నారు. 

జడ్జీల నియామకం కోసం పేర్లను ఒకసారి షార్ట్‌లిస్టు చేసే సమయంలో వారి కులం, మతం, ప్రాంతం చూసే అలవాటు లేదని చెప్పారు. వారికి అర్హత ఉందా? లేదా? వారికి చట్టాలు తెలుసా? లేదా? అనేది మాత్రమే చూస్తామని స్పష్టంచేశారు. జస్టిస్‌ ఏఎస్‌ చందూర్కర్‌ ఇటీవల బాంబే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు పదోన్నతిపై వచ్చారని, ఆయన తన పాత మిత్రుడేనని, గతంలో కలిసి పని చేశామని జస్టిస్‌ గవాయ్‌ వెల్లడించారు. ఆయనకు పదోన్నతి కలి్పంచే విషయంలో ఆ స్నేహాన్ని పక్కనపెట్టి, అర్హతలు మాత్రమే పరిగణనలోకి తీసుకున్నామని స్పష్టంచేశారు.    
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)