Breaking News

కశ్మీర్‌లో కలకలం.. ఉగ్రవాదులతో వైద్యుల దోస్తీ?

Published on Mon, 11/10/2025 - 11:11

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ పోలీసులు చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో పలు సంచలన విషయాలు బయటపడుతున్నాయి. కశ్మీర్ లోయలో ఒక వైద్యుని నుంచి పోలీసులు ఏకే-47 రైఫిల్‌తో పాటు కొంత మొత్తంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న దరిమిలా అతనిని అరెస్ట్‌ చేసి, విచారిస్తున్నారు.  

అరెస్టు అయిన వైద్యుడు వెల్లడించిన వివరాల ఆధారంగా జమ్ముకశ్మీర్ పోలీసులు ఫరీదాబాద్‌లో 300 కిలోల ఆర్‌డీఎక్స్‌, ఏకే-47 రైఫిల్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న ఆయనను.. ఆయుధాలు, పేలుడు పదార్థాలు నిల్వ చేయడంలో, రవాణా చేయడంలో అతని ప్రమేయంపై ఉన్నతాధికారులు ప్రశ్నించారు. పోలీసులు ఆ వైద్యుడిని పుల్వామా జిల్లాలోని కోయిల్ నివాసి ముజామిల్ షకీల్‌గా గుర్తించారు. ఈ వ్యవహారంలో మరో వైద్యుని ప్రమేయం  ఉన్నట్లు కూడా దర్యాప్తులో వెల్లడైంది. ఫరీదాబాద్‌లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, ఆయుధాలను నిల్వ చేయడంలో షకీల్ సహాయం చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారని ‘ఇండియా టుడే’ తన కథనంలో పేర్కొంది. 

ఈ కేసులో ఇద్దరు వైద్యుల ప్రమేయం ఉండటంతో జమ్ముకశ్మీర్‌ పోలీసులు ఈ ప్రాంతానికి చెందిన అందరు వైద్యులపై దృష్టి సారించారు. వారికి జైష్ ఎ మొహమ్మద్, ఘజ్వత్ ఉల్ హింద్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని జేకే పోలీసులతో పాటు భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. పోలీసులకు పట్టుబడిన ఇద్దరు వైద్యులపై ఆయుధ చట్టంలోని సెక్షన్లు 7/25, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ)లోని సెక్షన్లు 13, 28, 38, 39 కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

Videos

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు