Breaking News

ఉగ్రవాదుల చొరబాటు కట్టడికి అప్రమత్తంగా ఉన్నాం: ఆర్మీ

Published on Tue, 10/29/2024 - 21:10

శ్రీనగర్‌:  జమ్ము ప్రాంతంలోకి సరిహద్దు వెంబడి దాదాపు 50 మందికి పైగా ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందని భారత ఆర్మీ అంచనా వేస్తోంది. ఉగ్రవాదుల చొరబాటు కట్టడి విషయంలో ఆర్మీ బలగాలు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాయని తెలిపింది. ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని విఫలం చేస్తామని ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అఖ్నూర్ సెక్టార్‌లో ముగ్గురు ఉగ్రవాదులను విజయవంతంగా అంతం చేసిన అనంతరం 10వ పదాతిదళ విభాగానికి చెందిన జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ సమీర్ శ్రీవాస్తవ విలేఖరులతో మాట్లాడారు.  

‘‘పౌరులకు హాని కలిగించే ఉగ్రవాదుల ప్రయత్నాలను ఆర్మీ అడ్డుకుంటుంది. మంగళవారం ఉదయం అఖ్నూర్ సెక్టార్‌లోని ఒక గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలో 27 గంటల కాల్పుల్లో మరణించిన ఉగ్రవాదుల సంఖ్య మూడుకు చేరుకుంది. అఖ్నూర్‌ కఠినమైన నిఘాలో ఉంది. 

...అఖ్నూర్‌లో ఉగ్రవాదుల శాశ్వత ఉనికి లేదు.  మేము మా గార్డును వదులుకోం. చాలా కాలంగా ఈ ప్రాంతం చొరబాట్లను చూడలేదు. ప్రతి ఏడాది చొరబాటు విధానం మారుతోంది. ముఖ్యంగా చలికాలం సమయంలో మేము కూడా ఉగ్రవాదుల చొరబాటు కట్టడి విషయంలో అప్రమత్తంగా ఉన్నాం’’ అని అన్నారు.

ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం.. సరిహద్దుల వెంబడి 50 నుండి 60 మంది ఉగ్రవాదులు ఉన్నారని సీనియర్ ఆర్మీ అధికారి తెలిపారు. అఖ్నూర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చడం భద్రతా బలగాలకు లభించిన పెద్ద విజయంగా అభివర్ణించారు.

చదవండి: ఆర్మీ శునకం ‘ఫాంటమ్‌’ ఇకలేదు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)