Breaking News

ఒకే రోజు ఐఏఎఫ్‌, ఆర్మీ దంపతుల ఆత్మహత్య..

Published on Thu, 10/17/2024 - 17:04


న్యూఢిల్లీ: భారత సాయుధ దళాల్లో పనిచేస్తున్న ఓ జంట ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌, ఆర్మీలో  విధులు నిర్వహిస్తున్న వారిద్దరూ.. వేర్వేరు నగరాల్లో ఒకేరోజు ప్రాణాలు కోల్పోయారు. వివరాలు.. బీహార్‌కు చెందిన దీనదయాల్‌ దీప్‌ ఆగ్రాలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో లెఫ్టెనెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అతని భార్య రేణు తన్వర్ అదే నగరంలోని సైనిక ఆస్పత్రిలో  కెప్టెన్‌గా పనిచేస్తున్నారు. ఈ జంట 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు.

ఇటీవల తన్వర్‌ తన తల్లి, సోదరుడితో కలిసి వైద్య చికిత్స కోసం ఢిల్లీ  వెళ్లారు. ఇంతలో ఏమైందో తెలియదు. రాత్రి భోజనం తర్వాత గదిలోకి వెళ్లిన దీప్‌ మరుసటి రోజు బయటకు రాకపోవడంతో సహోద్యోగులు తలుపు పగలగొట్టి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించారు. భర్త మరణించాడనే విషయాన్ని తట్టుకోలేక  అతని ఆర్మీ అధికారి భార్య కూడా ఢిల్లీ కంటోన్మెంట్‌లోని గెస్ట్ హౌస్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. వీరిద్దరి చావుకి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే తన్వర్‌ వద్ద పోలీసులు సూసైడ్‌ లేఖను స్వాధీనం చేసుకున్నారు. తన భర్త దీప్‌తోమృతదేహంతో కలిపి తనకూ దహన సంస్కారాలు నిర్వహించాలని లేఖలో ఆమె కోరారు. తన్వర్‌ ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఆమె తల్లి, సోదరుడు ఆస్పత్రిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. దీప్‌ వద్ద ఎలాంటి సూసైడ్‌ నోటు లభ్యం కాలేదు. దీంతో అతడి మృతిపై పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)