Breaking News

శబరిమలలో ఏపీ యాత్రికుల బస్సు ప్రమాదం.. 11 మందికి గాయాలు

Published on Thu, 11/20/2025 - 17:45

పథనంతిట్ట: ఆంధ్రప్రదేశ్ నుంచి శబరిమలకు వెళ్తున్న యాత్రికుల బస్సు కేరళలోని మావత్తుపుళ సమీపంలోని త్రికలత్తూర్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 11 మంది అయ్యప్ప భక్తులు గాయపడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీ నుంచి శ్రీదుర్గా ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సులో ఇద్దరు చిన్నారులు సహా.. 33 మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు బయలుదేరారు.

వీరి బస్సు గురువారం తెల్లవారుజామున త్రికలత్తూర్‌లోని ఎంసీ రోడ్డు మీదుగా వెళ్తుండగా.. అటుగా వేగంగా దూసుకువచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో పాలక్కాడ్‌కు చెందిన లారీ డ్రైవర్ రెమీ, బస్సు డ్రైవర్ గౌతమ్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు ముందు వైపు సీట్లలో కూర్చున్న అయ్యప్ప భక్తులు బాలాజీ, వెంకటేశ్, మోహన్ బాబు, గోవింద్, చంద్రారెడ్డి, శ్రీనివాసులు, ఉమాపతి, ఉదయ్‌కుమార్, దీపికలకు స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను అలువాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు. యాత్రికులంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని వెల్లడించారు.

తప్పిన పెను ప్రమాదం
లారీ బస్సును వేగంగా ఢీకొనడంతో.. బస్సు డ్రైవర్ నియంత్రణను కోల్పోయి, పక్కనే ఉన్న హైటెన్షన్ విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టారు.   దాంతో విద్యుత్తు స్తంభం సగానికి విరిగిపోయింది. ఆ సమయంలో అటుగా వెళ్లిన స్థానికులు వెంటనే పోలీసులు, విద్యుత్తు శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో.. అధికారులు వెంటనే విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. ఈ ఘటనతో ఉదయం వరకు ఆ మార్గంలో తీవ్ర ట్రాఫిక్ జామ్ నెలకొంది. పోలీసులు గురువారం ఉదయం క్రేన్ సాయంతో లారీని రోడ్డు నుంచి తొలగించి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)