Breaking News

ఒడిశా, బీహార్‌ గుణపాఠాల తర్వాత రైల్వేశాఖ ఏం చేస్తున్నదంటే..

Published on Sat, 12/09/2023 - 11:54

ఒడిశా, బీహార్ రైలు ప్రమాదాల తరువాత భారతీయ రైల్వే.. వ్యవస్థాగతంగా భద్రతను మరింత పటిష్టం చేసే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలో దేశీయంగా అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ (ఏటీపీ) ‘కవచ్’ను ఇప్పటి వరకు 139 లోకోమోటివ్‌లపై (ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రేక్) 1465 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థను దక్షిణ మధ్య రైల్వే విభాగాల్లో అమర్చింది. 

లింగంపల్లి- వికారాబాద్‌- వాడికి చెందిన 265 కిలోమీటర్లు, వికాబాద్‌- బీదర్‌ సెక్షన్‌, మన్మాడ్‌- ముద్ఖేడ్‌ ధోనే- గుంతకల్‌ సెక్షన్‌కు చెందిన 959 కిలోమీటర్లు, బీదర్‌-బర్బణీ సెక్షన్‌కు చెందిన 241 కిలోమీటర్ల పొడవునా కవచ్‌ ఏర్పాటుకు సంబంధించిన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అలాగే ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా కారిడార్‌కు చెందిన సుమారు మూడు వేల కిలోమీటర్ల మార్గం కోసం టెండర్లు జారీ చేయగా, ఈ మార్గాల్లో పనులు పురోగతిలో ఉన్నాయి. భారతీయ రైల్వే ఆరు వేల కిలోమీటర్ల రైలు మార్గంలో సర్వే, డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్‌), పకడ్బందీ అంచనాలతో సహా అనేక సన్నాహక పనులను కూడా ప్రారంభించింది. 

‘కవచ్’ అనేది నడుస్తున్న రైళ్ల భద్రతను పెంచడానికి ఉపయోగించే ఆటోమేటెడ్ రైలు రక్షణ వ్యవస్థ. దీనిని మూడు భారతీయ కంపెనీల సహకారంతో రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్‌డీఎస్‌ఓ)దేశీయంగా అభివృద్ధి చేసింది. ‘కవచ్‌’ అనేది రైలు డ్రైవర్‌కు సిగ్నల్స్ పాస్ చేయడంలో, ప్రమాదాలను నివారించడంలో సహాయపడటమే కాకుండా ప్రతికూల వాతావరణంలోనూ రైలును నడపడంలో సహాయపడుతుంది. ‘కవచ్‌’ కారణంగా రైలు కార్యకలాపాల భద్రత, సామర్థ్యం మరింతగా పెరుగుతుంది.

రీసెర్చ్ డిజైన్, స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ సహాయంతో భారతీయ రైల్వే ఈ ‘కవచ్‌’ వ్యవస్థను సిద్ధం చేసింది. 2012లో ఈ పకడ్బందీ వ్యవస్థను ఉపయోగంలోకి తీసుకువచ్చింది. మొదట్లో ఈ ప్రాజెక్ట్ పేరు ‘ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్’. రైళ్లలో జీరో యాక్సిడెంట్ లక్ష్యాన్ని సాధించేందుకు రైల్వేశాఖ ఈ పకడ్బందీ వ్యవస్థను సిద్ధం చేసింది. పాసింజర్ రైళ్లలో మొదటి ఫీల్డ్ ట్రయల్స్ 2016 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యాయి. 
ఇది కూడా చదవండి: రాబోయే రోజుల్లో... దేశంలోని వాతావరణం ఇలా..

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య