Breaking News

మూడు దశాబ్దాల తర్వాత ఉగ్రమూకల అరెస్టుపై బీజేపీ హర్షం

Published on Mon, 07/14/2025 - 17:15

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి మూడు దశాబ్దాలుగా చిక్కకుండా తిరుగుతున్న ముగ్గురు టెర్రరిస్టులను ఏటీఎస్‌( యాంటీ టెర్రరిజం స్వ్కాడ్‌) అదుపులోకి తీసుకోవడంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై హర్షం వ్యక్తం చేశారు. సదీఖ్‌ అలీ అలియాస్‌ టైలర్‌ రాజా, మహ్మద్‌ అలీ మన్సూర్‌, అబుబాకర్‌ సిద్ధిఖిలను ఏటీస్‌ బృందం అదుపులోకి తీసుకోవడాన్ని ప్రత్యేకంగా అభినందించారాయన. 

ఇది తమిళనాడు ఏటీఎస్‌ పోలీసుల ఘనత అంటూ ఆయన కొనియాడారు.  రాష్ట్రంలో జరిగిన ఉగ్ర కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించిన ఈ ముగ్గుర్ని మూడు దశాబ్దాల తర్వాత పట్టుకోవడాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఈ మేరకు అన్నామలై ‘ఎక్స్‌’ వేదికగా ట్వీట్‌ చేశారు. 

 

1998లో కోయాంబత్తూర్‌లో జరిగిన ఉగ్రదాడిలో 59 మంది ప్రాణాలు కోల్పోగా, మరొకవైపు 1993లో చెన్నై ఆర్‌ఎస్‌ఎస్‌ ఆఫీస్‌లో జరిగిన బాంబు దాడి జరిగింది. ఇక 1995లో నాగూర్‌లో హిందూ మున్నాని నాయకుడు ముతుకృష్ణన్‌ భార్యను పొట్టనపెట్టుకున్నారు ఈ ఉగ్రవాదులు. రామాయణం పుస్తకంలో బాంబు దాచి ముతుకృష్ణన్‌ భార్యను హత్య చేశారు.  ఇలా పలు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డ వీరిపై ఏటీఎస్‌ నిఘా వేసి ఉంచింది. తప్పుడు ఐడెంటీ కార్డులతో ఖాళీగా ఉండే ప్రదేశాలను ఎన్నుకుని తప్పించుకుని తిరుగుతూ ఉన్న వీరిని ఎట్టకేలకు ఏటీఎస్‌ బృందం పట్టుకుంది.

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)