Breaking News

అన్నామలై రాజకీయం – ముంబైలో దక్షిణాది వారికి చిక్కులు

Published on Mon, 01/12/2026 - 20:35

ముంబైలో బతుకుతున్న దక్షిణాది ప్రజలకు  తమిళనాడు బీజేపీ నేత చేస్తున్న వ్యాఖ్యలు కొత్త సమస్యలు తెచ్చిపెట్టేలా ఉన్నాయి.ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి ముంబై వెళ్లినఅన్నామలై ముంబై కేవలం మహారాష్ట్రకు చెందిన నగరం మాత్రమే కాదని, అది ఒక అంతర్జాతీయ నగరమని అన్నారు. అక్కడితో ఆగకుండా బీజేపీ అభ్యర్థి  మేయర్‌గా ఎన్నికైతేనే దానికి ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు.

దీంతో ఈ వ్యాఖ్యలు ముంబై అస్తిత్వాన్ని, మరాఠీ ప్రజల ప్రాముఖ్యతను తగ్గించేలా ఉన్నాయంటూ శివసేన , ఎంఎన్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం అన్నామలై చేస్తున్న ఈ ప్రయత్నం చివరకు ఇక్కడ దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉంటున్న దక్షిణాది వారిని రిస్క్ లోకి నెట్టే ప్రమాదం ఉందన్న ఆందోళన అక్కడి ప్రజల్లో వ్యక్తమవుతోంది. రాజ్ థాక్రే.. అన్నామలైను రసమలై అని ఎద్దేవా చేస్తూ.. శివసేన పాత నినాదం హటావో లుంగీ, బజావో పుంగీ ని మళ్ళీ గుర్తు చేస్తూ ప్రాంతీయ సెంటిమెంట్‌ను రగిల్చారు.

ముంబైని మహారాష్ట్ర నుంచి వేరు చేసే ఏ ప్రయత్నాన్ని అయినా సహించేది లేదని, ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారు ముంబై గడ్డపై కాలు పెట్టనివ్వబోమని హెచ్చరించారు. శివసేన పత్రిక సామ్నాలో అన్నామలై ముంబైలో అడుగు పెడితే కాళ్లు తీసేస్తామని హెచ్చిరంచారు. దీనికి అన్నామలై కూడా తగ్గకుండా సమాధానమిచ్చారు. తాను ముంబై వచ్చి తీరుతానని, దమ్ముంటే తన కాళ్లు నరకాలని సవాలు విసిరారు.ముంబై అభివృద్ధిలో దక్షిణాది వారి పాత్ర కూడా ఉందని ఆయనంటున్నారు. ఈ ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న ఈ ఆధిపత్య పోరు చివరకు ధారవి వంటి ప్రాంతాల్లో నివసించే వేలాది మంది దక్షిణాది కూలీలు, వ్యాపారుల భద్రతకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందన్న ఆందోళన అక్కడి దక్షిణాదివారిలో వ్యక్తమవుతోంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)