Breaking News

Amritpal Singh Arrest: గర్వంగా ఉంది! తల్లిదండ్రుల రియాక్షన్‌..

Published on Sun, 04/23/2023 - 19:56

పోలీసులను ముప్పు తిప్పులు పెడుతున్న ఖలిస్థానీ సానుభూతిపరుడు, 'వారిస్‌ పంజాబ్‌ దే' చీఫ్‌ అమృత్‌ పాల్‌ సింగ్‌ను ఆదివారం అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అతడి తల్లి స్పందిస్తూ..తన కొడుకు ఓ యోధుడిలా లొంగిపోయినందుకు గర్వంగా ఉందన్నారు. అతని అరెస్టుకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తామని అతడి తల్లి బల్వీందర్‌ కౌర్‌ అన్నారు. అలాగే అతడి తండ్రి తార్సేమ్‌ సింగ్‌ ప్రజలు వేధింపులకు గురవుతున్నందున అమృత్‌పాల్‌ని లొంగిపోవాలిన తాను కోరినట్లు చెప్పారు. ఈ కేసుపై తాము పోరాడతామన్నారు. అంతేగాదు అతని గురించి మొత్తం సమాజం పోరాడాలన్నారు.

అమృత్‌పాల్‌ డ్రగ్స్‌ ముప్పు నుంచి ప్రజలను రక్షించడానికి పనిచేస్తున్నాడని తాను కూడా అందు కోసమే కృషి చేస్తున్నాని చెప్పుకొచ్చారు తార్సేమ్‌. కాగా, వారిస్ పంజాబ్ దేపై పంజాబ్ పోలీసులు అణిచివేత ప్రారంభించిన తర్వాత నుంచి అమృతపాల్ పరారీలో ఉన్నాడు. అతని అనుచరులను ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకుంటూ..35 రోజుల వేట అనంతరం పక్కా సమాచారంతో మోగా జిల్లాలోని గురుద్వార్‌ వద్ద అమృత్‌పాల్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతనిపై కఠినమైన జాతీయ భద్రత చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ మేరకు పోలీసులు అమృత్‌పాల్‌ని భద్రత దృష్ట్యా అసంలోని దిబ్రూఘర్‌ జైలుకి తరలించారు.  

(చదవండి: హెలికాప్టర్‌ వద్ద సెల్ఫీ తీసుకుంటుండంగా..అంతలోనే..)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)