Breaking News

బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ హావా.. నిజమైన అమిత్ షా జోస్యం?

Published on Fri, 11/14/2025 - 11:32

బిహార్ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి దుమ్మురేపుతోంది. 180కి పైగా సీట్లలో అధిక్యం సంపాదించి భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ కాషాయ కూటమికి పట్టం కట్టినా ఇంత భారీ స్థాయిలో మెజారిటీ వస్తుందని ఎవరూ చెప్పలేదు. అయితే  కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాత్రం ఎన్డీఏ కూటమి తప్పకుండా 160కి పైగా సీట్లు వస్తాయని, మూడింట రెండో వంతు మెజారిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

దేశం యావత్తు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిహార్ ఎన్నికలు ఫలితాలు విడుదలవుతున్నాయి. ఫలితాలలో అధికార ఎన్డీఏ కూటమి హావా స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు 180పైగా సీట్లలో కాషాయకూటమి అధిక్యం కనబరుస్తోంది. మహాగఠ్ భందన్ 50 కిపైగా సీట్లలో అధిక్యంలో ఉంది. ఈ ఫలితాలు చూస్తుంటే బిహార్ లో మరోసారి నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం దాదాపుగా ఖాయమైనట్లే. అయితే బిహార్ ఎన్నికల కోసం ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంతగానో శ్రమించింది. కాంగ్రెస్ అగ్రనేత బిహార్ ఎన్నికల ప్రచారాన్ని స్వయంగా తన భూజాలపైన వేసుకొని రాష్టమంతా కలియతిరిగారు. ఎ‍న్నికల కమిషన్ ఓట్లు దొంగలిస్తుందని గతంలో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఇలానే జరిగిందంటూ ప్రచారం చేశారు. ఆర్జేడీ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ సైతం ఇంటికొక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని బిహార్ ని అభివృద్ధి చేస్తామని ఎన్నో హామీలు ఇచ్చారు. అయినప్పటికీ బిహార్ ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టినట్లు ఫలితాల ట్రెండ్ సూచిస్తుంది.

కాగా కేంద్రం హోం మంత్రి అమిత్ షా మెుదటినుంచి ఎన్డీఏ కూటమికి 160కి పైగా సీట్లు వస్తాయన్నారు. "బిహార్ ప్రజలు ఎన్డీఏతో ఉన్నారు. ఇది పాండవుల యుద్ధం ఐదు పార్టీల సంకీర్ణం( జేడీయూ, బీజేపీ, ఎల్జేపీ, హెచ్ ఏ మ్, ఆర్ఎల్ఎమ్) కలిసికట్టుగా పోరాడుతున్నాం" అని అమిత్ షా ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఆకట్టుకునే యత్నం చేశారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)