Breaking News

నెహ్రూ వల్లే కశ్మీర్లో కుంపట్లు

Published on Thu, 12/07/2023 - 05:41

జమ్మూ కశ్మీర్‌ ఏడు దశాబ్దాలుగా అనుభవిస్తున్న కష్టనష్టాలన్నింటికీ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చేసిన భారీ తప్పిదాలే ఏకైక కారణమని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా లోక్‌సభలో ఆరోపించారు. అవే అక్కడ ఉగ్రవాదానికి, వేర్పాటువాద కుంపట్లకు, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ పుట్టుకకు కారణమయ్యాయని దుయ్యబట్టారు. ‘‘మన సైన్యం పాక్‌ దళాలను తరిమికొడుతున్న వేళ కశ్మీర్‌ను పూర్తిగా తిరిగి స్వా«దీనం చేసుకోక ముందే నెహ్రూ ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించారు.

అంతటితో ఆగకుండా కశ్మీర్‌ అంశాన్ని హడావుడిగా, అనవసరంగా ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన చేసిన ఈ రెండు ఘోర తప్పిదాలే కశ్మీర్‌లో ఆరని కుంపట్లకు కారణమయ్యాయి. నెహ్రూది నిజంగా చారిత్రక తప్పిదం!’’ అని మండిపడ్డారు. దీనిపై కాంగ్రెస్, విపక్షాలు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చాయి. బీజేపీ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించాయి. షా వ్యాఖ్యలను నిరసిస్తూ వాకౌట్‌ చేశాయి.

అనంతరం అమిత్‌ షా మాట్లాడుతూ, నెహ్రూయే గనక అప్పట్లో సరైన చర్యలు తీసుకుని ఉంటే కశ్మీర్లో చాలా భాగాన్ని పాక్‌కు కోల్పోయే వాళ్లమే కాదని పునరుద్ఘాటించారు. అంతేగాక పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ఎప్పుడో తిరిగి భారత్‌లో అంతర్భాగంగా మారేదని అభిప్రాయపడ్డారు. ‘‘అప్పటికి మన సైన్యం పంజాబ్‌ దాటి కశ్మీర్‌కేసి దూసుకుపోతోంది. నెహ్రూ కాల్పుల విరమణను కనీసం మూడు రోజులు ఆలస్యం చేసినా పీఓకే ఇప్పుడు భారత్‌లో అంతర్భాగంగా ఉండేది’’ అని ఆక్షేపించారు. అంతా అయిపోయాక, కాల్పుల విరమణ పొరపాటు నిర్ణయమని నెహ్రూ తీరిగ్గా అంగీకరించారని విమర్శించారు.

ఆయన చేసిన సరిదిద్దుకోలేని తప్పిదం వల్ల భారీ భూభాగాన్ని దేశం కోల్పోవాల్సి వచ్చిందన్నారు. 1962లో చైనాతో భారత యుద్ధానికి దారి తీసిన నెహ్రూ ‘భారీ తప్పిదం’ గురించి కూడా మాట్లాడాలని బిజూ జనతాదళ్‌ సభ్యుడు భర్తృహరి మహతబ్‌ కోరగా అమిత్‌ షా తనదైన శైలిలో స్పందించారు. ‘‘నెహ్రూ  తప్పిదాల్లో రెండింటిని ప్రస్తావిస్తేనే విపక్షాలు అలిగి వాకౌట్‌ చేశాయి. ఇక భారీ తప్పిదం గురించి మాట్లాడితే ఏకంగా రాజీనామా చేసేవేమో!’’ అంటూ ఎద్దేవా చేశారు. అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలు ఎవరినీ అవమానించడానికి కాదని, జరిగిన వాస్తవాలను దేశం ముందుంచే ప్రయత్నం మాత్ర మేనని స్పీకర్‌ ఓం బిర్లా అన్నారు. ఇక 370 ఆరి్టకల్‌ను రద్దు చేసే దమ్ము గత కాంగ్రెస్‌ సర్కారుకు లేకపోయిందని అమిత్‌ షా ఎద్దేవా చేశారు.

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)