అభివృద్ధి కావాలా? అరాచకం కావాలా?

Published on Sun, 11/02/2025 - 05:36

గోపాల్‌గంజ్‌: మోదీ–నితీశ్‌ కుమార్‌ల అభివృద్ధి అజెండా కావాలో లేక రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్జేడీ) జంగిల్‌రాజ్‌ కావాలో తేల్చుకోవాలని బిహార్‌ ప్రజలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పష్టంచేశారు. అభివృద్ధి పట్టం కట్టాలా? లేక ఆటవిక రాజ్యం కావాలా? అనేది మన చేతుల్లోనే ఉందన్నారు. శనివారం బిహార్‌లో గోపాల్‌గంజ్, సమస్తీపూర్, వైశాలి జిల్లాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో అమిత్‌ షా వర్చువల్‌గా ప్రసంగించారు.

 వాతవరణం అనుకూలించకపోవడంతో ఆయా ప్రాంతాలకు ఆయన చేరుకోలేకపోయారు. బిహార్‌ అభివృద్ధి బాధ్యతను ఎవరికి అప్పగించాలో నిర్ణయించడానికి ఈ  ఎన్నికలు ఒక సువర్ణావకాశమని అమిత్‌ షా చెప్పారు. గతంలో ఆర్జేడీ పాలనలో ఎన్నో అకృత్యాలు జరిగాయని వెల్లడించారు. అప్పట్లో నక్సలైట్లు పెట్రేగిపోయారని, రక్తం ఏరులై పారిందని అన్నారు. భూస్వాముల ప్రైవేట్‌ సైన్యాలు ప్రజలపై పెత్తనం చెలాయించాయని గుర్తుచేశారు. ఆనాటి రాక్షస రాజ్యం మళ్లీ రావొద్దంటే ఆర్జేడీని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

రైతులు, మహిళల సంక్షేమానికి పెద్దపీట 
రాష్ట్రంలో ఎన్డీయేకు మరోసారి అధికారం కట్టబెడితే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని అమిత్‌ షా హామీ ఇచ్చారు. రైతులు, మహిళల సంక్షేమానికి ఎన్డీయే మేనిఫెస్టోలో పెద్దపీట వేసినట్లు తెలిపారు. 1.41 కోట్ల మంది జీవికా దీదీల ఖాతాల్లోకి ఇటీవల ప్రభుత్వం రూ.10 వేల చొప్పున జమ చేసినట్లు చెప్పారు. మళ్లీ అధికారంలోకి వస్తే వారికి రూ.2 లక్షల దాకా ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. 27 లక్షల మంది రైతులకు ప్రతి ఏటా రూ.9,000 చొప్పున అందజేస్తామన్నారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలోని అన్ని చక్కెర కర్మాగారాలను మళ్లీ తెరిపిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అమిత్‌ షా ఆగ్రహం వ్యక్తంచేశారు. చొరబాటుదారులను కాపాడేందుకు రాహుల్‌ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్‌ చేసిన ఓటర్‌ అధికార్‌ యాత్రను తప్పుపట్టారు. ఎవరు ఎన్ని యాత్రలు చేసినా చొరబాటుదారులను బయటకు పంపించడం తథ్యమని అమిత్‌ షా తేల్చిచెప్పారు.   

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)