Breaking News

రాజకీయ ప్రలోభాలకు లోనుకావొద్దు: రైతు సంఘాలకు కేంద్రం హితవు

Published on Wed, 02/14/2024 - 12:00

ఢిల్లీ, సాక్షి: ఢిల్లీ ఛలో పేరిట ఆందోళనలను తీవ్రతరం చేయాలని రైతు సంఘాలు భావిస్తున్న తరుణంలో కేంద్రం స్పందించింది. మరోసారి చర్చలకు రావాలని రైతు సంఘాల్ని ఆహ్వానించింది. తమతో కేంద్రం అవలంభిస్తున్న వైఖరికి నిరసనగా.. ఈ నెల 16వ తేదీన భారత్‌ బంద్‌కు కిసాన్‌ మోర్చా పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. 

భారత్‌ బంద్‌ ప్రకటించిన కాసేపటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్‌ ముండా మీడియాతో మాట్లాడారు. ‘‘చర్చల ద్వారా రైతు సంఘాలు సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలి. అంతేగానీ.. రాజకీయ పార్టీల ప్రలోభాలకు రైతు సంఘాలు గురి కావొద్దు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని గుర్తించాలి’’ అని కోరారాయన.

అలాగే.. రైతుల మార్చ్‌ నేపథ్యంలో దేశ రాజధాని ప్రాంతంలో.. శివారుల్లో భారీగా ట్రాఫిక్‌ ఝామ్‌ ఏర్పడుతోంది. ఈ పరిణామంపైనా మంత్రి అర్జున్‌ ముండా స్పందించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని రైతుల్ని కోరారాయన. మరోవైపు చర్చల పిలుపుపై రైతు సంఘాలు స్పందించాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే.. ఢిల్లీ సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచే పంజాబ్‌, హర్యానా, యూపీ నుంచి ఢిల్లీ వెళ్లే సరిహద్దులోనే ఉండిపోయారు. మంగళవారం ఉదయం నుంచే ఢిల్లీ వైపు వెళ్లేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఢిల్లీకి రెండు వంద కిలోమీటర్ల పరిధిలోనే వాళ్లను నిలువరించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సరిహద్దులో బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. 

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు