Breaking News

అమర్‌నాథ్‌ యాత్ర తాత్కాలిక నిలిపివేత

Published on Thu, 07/31/2025 - 07:01

శ్రీనగర్‌: పహల్గాం, బాల్తాల్‌ మార్గాల్లో అమర్‌నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. బుధవారం తెల్లవారుజామునుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముందు జాగ్రత్త చర్యగా నిలిపివేసినట్లు జమ్మూ కశశ్మీర్‌ డివిజనల్‌ కమిషనర్‌ విజయ్‌ కుమార్‌ బిధూరి తెలిపారు. రెండు మార్గాల్లోనూ కురుస్తున్న భారీ వర్షాలు బేస్‌ క్యాంపుల నుంచి యాత్రికుల రాకపోకలను ప్రభావితం చేశాయన్నారు.

పరిస్థితి మెరుగుపడేవరకు బాల్తాల్, నున్వాన్‌ బేస్‌ క్యాంపుల వైపు ఎలాంటి రాకపోకలను అనుమతించబోని తెలిపారు. ఈ విషయంలో యాత్రికులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తామని అధికారులు వెల్లడించారు. పరిస్థితులు మెరుగుపడితే యాత్రను తిరిగి ప్రారంభించే విషయాలను కూడా యాత్రికులకు తెలియజేస్తామన్నారు. జూలై మూడో తేదీన ప్రారంభమైన ఈ యాత్ర ఆగస్టు 9వ తేదీతో ముగియనుంది.

ఈ పవిత్ర వార్షిక యాత్ర కోసం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వస్తారు. యాత్రికులు రెండు మార్గాల్లో పుణ్య క్షేత్రానికి చేరుకుంటారు. ఒకటి 48 కిలోమీటర్ల పొడవైన పహల్గాం మార్గం కాగా, మరోటి నిటారుగా ఉన్న తక్కువ దూరమైన బాల్తాల్‌ మార్గం. ఈ ఏడాది ఇప్పటివరకు 3.93 లక్షల మంది యాత్రికులు అమర్‌నాథ్‌ను దర్శించుకున్నారు.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)