Breaking News

అమర్‌నాథ్ యాత్రలో అపశృతి.. సహాయక చర్యలు ముమ్మరం

Published on Sat, 07/05/2025 - 10:25

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో జూలై మూడు నుంచి ప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్రలో తాజాగా స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. రాంబన్‌లోని చందర్‌కోట్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో పలువులు యాత్రికులు గాయపడ్డారు. ఇక్కడి నుంచి పహల్గామ్‌నకు వెళ్లే రహదారిలో ఐదు బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 36 మంది భక్తులు గాయపడ్డారని అధికారులు తెలిపారు.

యాత్రా కాన్వాయ్‌లో ఈ బస్సులు బ్రేక్ ఫెయిల్ కావడంతో నియంత్రణ కోల్పోయి ఒకదానికొకటి ఢీకొన్నాయని అధికారులు వివరించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఆరోగ్య శాఖ రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన యాత్రికులను రాంబన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఏడాది జూలై 3న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర ఆగస్టు 9 వరకు అంటే రక్షా బంధన్ వరకూ కొనసాగనుంది. సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర గుహకు యాత్రికులు రెండు మార్గాల ద్వారా చేరుకుంటారు. వాటిలో ఒకటి పహల్గామ్ మార్గం. రెండవది బాల్తాల్ మార్గం.
 

 

6,979 మంది యాత్రికుల బృందం శనివారం జమ్ము నుండి కాశ్మీర్‌కు గట్టి భద్రత మధ్య అమర్‌నాథ్‌ యాత్రకు బయలుదేరింది. జూలై 3న ప్రారంభమైన ఈ యాత్ర 38 రోజులపాటు జరగనుంది. గడచిన రెండు రోజుల్లో 26,800 మందికి పైగా భక్తులు అమర్‌నాథ్‌ను దర్శించుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కొత్త బ్యాచ్ భగవతి నగర్ యాత్ర నివాస్ నుండి 312 వాహనాలతో కూడిన రెండు ఎస్కార్ట్ కాన్వాయ్‌లలో బయలుదేరింది. ఈ యాత్రికులలో 2,753 మంది బాల్టాల్ బేస్ క్యాంప్‌కు వెళుతుండగా, 4,226 మంది నున్వాన్ (పహల్గామ్) బేస్ క్యాంప్‌కు బయలుదేరారు. 
 

ఇది కూడా చదవండి: ‘బెట్టింగ్‌ యాప్‌’ వరుడు పరార్‌.. ఈడీ అదుపులో అతిథులు

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)