Breaking News

‘దటీజ్‌ యోగి’.. పోలీసింగ్‌లో సరికొత్త అధ్యాయం!

Published on Wed, 09/24/2025 - 09:00

ఉత్తర ప్రదేశ్‌ పోలీసింగ్‌ వ్యవస్థ దేశచరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా.. ఓ మహిళా పోలీసుల బృందం ఎన్‌కౌంటర్‌లో పాల్గొంది. ఈ క్రమంలో తమపై కాల్పులకు దిగిన నేరస్తుడిని చాకచక్యంగా వ్యవహరించి పట్టుకోగలిగింది. దీంతో ఆ బృందంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ ప్రత్యేక ప్రశంసలు గుప్పించారు. 

ఆ వివరాల్లోకి వెళ్తే.. సోమవారం రాత్రి ఘాజియాబాద్‌ లోహియా నగర్ (Ghaziabad Lohia Nagar) వద్ద మహిళా పోలీసుల బృందం ఒకటి గస్తీ నిర్వహిస్తోంది. ఆ సమయంలో స్కూటర్‌పై వెళ్తున​ ఓ వ్యక్తిని ఆపబోయారు. అతను పారిపోవడానికి ప్రయత్నించే క్రమంలో స్కూటర్‌తో సహా జారి పడిపోయాడు. ఆపై తన దగ్గర ఉన్న నాటు తుపాకీతో పోలీసులపైకి కాల్పులు జరిపాడు. దీంతో ఆ బృందం ప్రతి కాల్పులకు దిగింది. 

ఈ క్రమంలో.. కాలిలో బుల్లెట్‌ దిగడంతో నిందితుడు లొంగిపోయాడు. అతని పేరు జితేంద్ర కుమార్‌ అని, ఫోన్లు, చైన్ల దొంగతనాలతో పాటు బైకుల చోరీలకు సంబంధించి 8 కేసులు నమోదు అయ్యాయని పోలీసులు వెల్లడించారు. అతని నుంచి ఓ దేశీయ తుపాకీ, రెండు కార్ట్రిడ్జులు, చోరీ చేసిన స్కూటర్, మొబైల్ ఫోన్, టాబ్లెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో యోగి ప్రభుత్వంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

యోగి ప్రశంసలు 
దేశంలో ఇప్పటిదాకా జరిగిన పలు ఎన్‌కౌంటర్‌లలో మహిళా పోలీసులు భాగంగా మాత్రమే ఉన్నారు. అయితే పూర్తిగా మహిళా పోలీసులు ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొనడం విశేషం(Women Police Encounter). ఈ ఆపరేషన్‌ను మహిళా పీఎస్‌ స్టేషన్‌ హెడ్‌ రీతూ త్యాగీ నేతృత్వంలో జరిగింది. ముగ్గురు మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు మహిళా హెడ్ కానిస్టేబుళ్లు ఇందులో పాల్గొన్నారు. 

ఉత్తర ప్రదేశ్‌లో మహిళా సాధికారత కోసం మిషన్‌ శక్తి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది యోగి ప్రభుత్వం. అయితే ఈ ఘటన మహిళా పోలీసుల సామర్థ్యాన్ని ప్రతిబింబించే ఘట్టంగా  ఏసీపీ ఉపాసనా పాండే అభివర్ణిస్తున్నారు. మరోవైపు.. ఈ చరిత్రాత్మక ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న మహిళా బృందానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అభినందనలు తెలియజేశారు. వారి ధైర్యం, సమర్థత, నిబద్ధత.. పోలీసింగ్‌లో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని ఆయన ప్రశంసించారు.

మాఫియా, గ్యాంగులు, తీవ్ర నేరస్తులపై యోగి సారథ్యంలోని యూపీ గవర్నమెంట్‌ కఠిన వైఖరి అవలంభిస్తోంది. ఈ ప్రభుత్వంలో 2017 నుండి 2024 చివరి వరకు మొత్తం 10,713 ఎన్‌కౌంటర్లు జరిగాయని అధికారిక సమాచారం వెల్లడించింది. ఈ ఎన్‌కౌంటర్‌లలో 63 మంది క్రిమినల్స్‌ మరణించగా.. 1,708 మంది నేరస్థులు గాయపడ్డారు. మరో 5,967 మంది అరెస్ట్ అయ్యారు. పోలీస్‌ సిబ్బంది 401 మంది గాయపడగా.. ఒకరు వీరమరణం పొందారు.

ఇదీ చదవండి: నా 23 కోట్లు పోయాయి.. వాళ్లతో మీరు జాగ్రత్త!

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)