Breaking News

బడ్జెట్‌ సెషన్‌: కొనసాగుతున్న అఖిలపక్ష సమావేశం

Published on Tue, 01/27/2026 - 11:48

ఢిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌-పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్‌ రిజిజు నేతృత్వంలో ఆల్‌పార్టీ మీటింగ్‌ జరుగుతోంది. సెషన్‌ సజావుగా సాగేందుకు సహకరించాలని ఈ సందర్భంగా కేంద్రం అన్ని పార్టీలను కోరుతున్నట్లు సమాచారం. 

బడ్జెట్ సమావేశాల్లో.. వివిధ రంగాల్లో సంస్కరణల కోసం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇప్పటికే జేపీసీ పరిశీలనలో ఉన్న జమిలి ఎన్నికల కోసం 129 రాజ్యాంగ సవరణ బిల్లు, అలాగే విద్యారంగంలో సంస్కరణల కోసం  వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లు, సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. అయితే.. 

గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు, ఎస్ఐఆర్ అంశాలపై విపక్షాలు కేంద్రంపై పోరాటానికి దిగాయి. ఈ తరుణంలో బడ్జెట్‌ సమావేశాలను తమ నిరసనలకు వేదికగా మార్చుకోవాలనుకుంటున్నాయి. చర్చకు పట్టుబట్టే అవకాశం ఉండడంతో.. తమకు సహకరించాలని అఖిలపక్షం ద్వారా కేంద్రం బతిమాలుతోంది. ఇదిలా ఉంటే.. 

 

 జనవరి 28  నుంచి ఏప్రిల్ 2 వరకు రెండు దశల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. తొలి దశ రేపు.. రాష్ట్రపతి ద్రౌపది మురుము ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం అవుతాయి. కేంద్రం జనవరి 29న ఆర్థిక సర్వే.. ఫిబ్రవరి 1న ఆదివారంనాడు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 13వ తేదీతో తొలి విడత బడ్జెట్‌ సమావేశాలు ముగుస్తాయి. అలాగే.. మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)