Breaking News

28 నుంచి బడ్జెట్‌ సెషన్‌ 27న అఖిలపక్ష భేటీ 

Published on Sun, 01/25/2026 - 01:18

న్యూఢిల్లీ: జనవరి 28వ తేదీ నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఒక రోజు ముందుగా 27వ తేదీన అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సమావేశంలో ఎజెండాతోపాటు ఇతర అంశాలు చర్చకు రానున్నాయి. పార్లమెంట్‌ హౌస్‌ అనెక్స్‌లోని కమిటీ మెయిన్‌ రూంలో 27వ తేదీ ఉదయం 11 గంటలకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరుగనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

యూపీయే హయాంలో తీసుకువచి్చన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థాయిలో కేంద్రం ఇటీవల తీసుకువచి్చన వీబీ– గ్రామీణ్‌ చట్టానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఒక వైపు దేశ వ్యాప్త ఆందోళనలు కొనసాగిస్తుండగా, మరో వైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన టారిఫ్‌లతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుదేలైన వేళ పార్లమెంట్‌ సెషన్‌ మొదలవుతుండటం గమనార్హం. ఈ నెల 28వ తేదీన ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంతో సెషన్‌ ప్రారంభం కానుంది. పార్లమెంట్‌ చరిత్రలోనే అత్యంత అరుదుగా ఫిబ్రవరి ఒకటో తేదీ, ఆదివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండటం తెల్సిందే.  

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)