Breaking News

ఆ నిజాన్ని మనమందరం అంగీకరించాలి!: అజిత్‌ పవార్‌ కీలక వ్యాఖ్యలు

Published on Tue, 05/30/2023 - 07:44

మహారాష్ట్ర కూటమిపై నేపనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు(ఎన్సీపీ) అజిత్‌ పవార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో శివసేన-బీజేపీ కూటమిని ఓడించేందుకు మహా వికాస్‌ అఘాడి(ఎంవీఏ) కలిసి పనిచే​స్తుందని చెప్పారు. ఈ మేరకు అజిత్‌ పవార్‌ మీడియాతో మాట్లాడుతూ..మహా వికాస్‌ అఘాడి(ఎంవీఏ) అగ్ర నేతలు రానున్న లోక్‌సభ​, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దీనికి మద్దతిస్తున్నట్లు కూడా తెలిపారు.

అలాగే ఎంవీఏలో సొంత పార్టీ గురించి ఆలోచించకుండా ఎలక్టివ్‌ మెరిట్‌ ఆధారంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ఎంవీఏ నేతలు కలిసి నిర్ణయిస్తారని చెప్పారు. ఎంవీఏ తన ఎమ్మెల్యే, ఎంపీలను ఎలా పెంచాలనే దానిపై చర్చించి కలిసి నిర్ణయం తీసుకుంటామన్నారు. అదే సందర్భంలో కూటమి ప్రాముఖ్యతను వివరిస్తూ..మహా వికాస్‌ అఘాడి(శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ)లో ఉన్న పార్టీలు ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేవన్నది వాస్తవమని, దీన్ని మనమందరం అంగీకరించాలని పవార్‌ అన్నారు.

ఏక్‌నాథ్‌్‌ షిండే, బీజేపీ కూటమిని ఓడించడానికి తామంతా ఏకతాటిపైకి వచ్చి పోటీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత శివసేన ఏక్‌నాథ్‌ షిండే బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకుంటే..మనం కలిసి ఉండాలి, ఎలాంటి పొరపొచ్చా లేకుండా పోటీ చేయాలి. అప్పుడే మనం కచ్చితంగా ఎన్నికల్లో గెలవగలమని చెప్పారు అజిత్‌ పవార్‌. కాగా మహారాష్ట్రలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు 2024లో జరగనున్నాయి. 

(చదవండి: మోదీ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోంది)

Videos

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)