Breaking News

ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్‌గా అశుతోష్‌ దీక్షిత్‌

Published on Tue, 10/06/2026 - 19:23

ఢిల్లీ: భారత వాయుసేన (IAF) తదుపరి చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్‌గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ నియమితులయ్యారు. కేంద్రప్రభుత్వం ఆయనను నియమిస్తూ ఆదేశాలు  జారీ చేసింది. ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్‌గా సేవలందిస్తున్న ఆయన, ఈ నెల అక్టోబర్ 31న చీఫ్‌ ఆఫ్‌ది ఎయిర్‌ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.  

ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్‌కు PVSM, AVSM, VM, VSM వంటి ప్రతిష్ఠాత్మక సైనిక పురస్కారాలు అందుకున్నారు. ఆయన  నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ (DSSC), నేషనల్ డిఫెన్స్ కాలేజ్ (NDC)లో ఆయన విద్యాభ్యాసం పూర్తి చేశారు.

అశుతోష్‌ దీక్షిత్ వాయుసేనలో ఆయన అనేక కీలకమైన ఆపరేషనల్, వ్యూహాత్మక బాధ్యతలను నిర్వహించారు. హెడ్‌క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్‌లో చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (CISC)గా పనిచేశారు. అనంతరం ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్, సెంట్రల్ ఎయిర్ కమాండ్ విధులను నిర్వర్తించారు.

తన సుదీర్ఘ వాయుసేన కెరీర్‌లో ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ కీలకమైన సైనిక ఆపరేషన్లలోనూ పాల్గొన్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సఫేద్ సాగర్, ఆపరేషన్ రక్షక్లో ఆయన పాలుపంచుకున్నారు. ఫైటర్ పైలట్‌గా, టెస్ట్ పైలట్‌గా, శిక్షకుడిగా, ఫ్రంట్‌లైన్ ఫైటర్ బేస్ కమాండర్‌గా, అలాగే ఉన్నతస్థాయి వ్యూహాత్మక,ఆపరేషనల్ బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు భారత వాయుసేన అత్యున్నత పదవిని చేపట్టనున్నారు.

 

ఇదీ చదవండి: హర్ముజ్‌లో తీవ్ర ఉద్రిక్తత
 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)