Breaking News

విమానంలో 322 మంది.. 8 గంటల జర్నీ తర్వాత వెనక్కి!

Published on Mon, 03/10/2025 - 13:19

న్యూఢిల్లీ, సాక్షి: ముంబై-న్యూయార్క్‌ ఎయిరిండియా విమానం. ఎనిమిది గంటల ప్రయాణం తర్వాత.. ఎలా వెళ్లిందో అలాగే తిరిగి వెనక్కి వచ్చేసింది. దీంతో ప్రయాణికులంతా కంగారు పడ్డారు. మరోవైపు అధికారులు హడావిడిగా వాళ్లందరినీ దించేసి.. బాంబు స్క్వాడ్‌ను పిలిపించి తనిఖీలు చేయించారు. చివరకు తమకు వచ్చిన సమాచారంగా తేల్చారు. 

303 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బంది ఎయిరిండియాకు చెందిన బోయింగ్‌ 777 విమానం గత అర్ధరాత్రి 2గం. ముంబై నుంచి న్యూయార్క్‌కు బయల్దేరింది. సుమారు 15 గంటల తర్వాత జాన్‌ ఎఫ్‌ కెనడీ ఎయిర్‌పోర్టుకు అది చేరుకోవాల్సి ఉంది. అయితే విమానంలో బాంబు ఉందనే సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో అజర్‌బైజాన్‌ దాకా వెళ్లిన విమానానికి.. వెనక్కి రప్పించారు.

ముంబైలో ఈ ఉదయం 10.20 గం. ప్రాంతంలో ఎయిరిండియా విమానం దిగగానే..  ప్రయాణికులను దించేసి బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేయించారు. చివరకు బెదిరింపు కాల్‌గా నిర్ధారించుకున్నారు. రద్దైన విమానం మంగళవారం ఉదయం 5గం. రీషెడ్యూల్‌ చేసినట్లు ప్రకటించింది.  అసౌకర్యానికి  ప్రయాణికులకు క్షమాపణ చెప్పిన ఎయిరిండియా.. వాళ్ల భద్రతే తమకు ముఖ్యమని తెలిపింది. ఈ ప్రయాణంలో వాళ్లకు అన్ని రకాల వసతులు కల్పిస్తామని తెలిపింది. మరోవైపు.. ఈ ఘటనపై ఎయిరిండియా ఫిర్యాదుతో అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)