Breaking News

ఇరాన్‌ ఎఫెక్ట్‌.. ఎయిర్‌ ఇండియాకు తప్పిన ముప్పు.. విమానాల దారి మళ్లింపు

Published on Fri, 06/13/2025 - 09:32

ఢిల్లీ: ఇరాన్‌, ఇజ్రాయెల్‌ దాడులతో మరోసారి యుద్ధ వాతావరణం నెల‍కొంది. ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల కారణంగా గగనతలంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాజాగా ముంబై నుంచి లండన్‌ బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానం.. మూడు గంటల ప్రయాణం తర్వాత వెనక్కి వచ్చింది. దీంతో, ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గగనతలంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 5:39 గంటలకు ముంబై నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది. మూడు గంటల ప్రయాణం తర్వాత రాడార్‌లో సిగ్నల్స్‌ సమస్య తలెత్తింది. దీంతో, సదరు విమానం తిరిగి వెనక్కి వచ్చేసింది. ఫ్లైట్‌ రాడార్‌ 24 ద్వారా ఈ విషయం నిర్ధరణ అయ్యింది. రాడార్‌ సిగ్నల్స్‌ సమస్య కారణంగానే విమానం వెనక్కి మళ్లినట్లు సమాచారం.

ఇక, ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా ఇరాన్‌.. తన గగనతలాన్ని మూసివేసింది. దీంతో, పలు దేశాలకు చెందిన విమాన సర్వీసులపై ఈ ప్రభావం పడింది. అనేక విమాన సర్వీసులకు దారి మళ్లిస్తున్నారు. ఎయిర్‌ ఇండియాకు చెందిన విమానాలను కూడా దారి మళ్లిస్తున్నట్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ఎయిర్‌ ఇండియా స్పందిస్తూ..‘ ఊహించని అంతరాయం కారణంగా ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. ప్రయాణీకులకు వసతి కల్పించడంతో సహా అన్ని వసతులు కల్పలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము. ప్రయాణీకులను వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది.

విమాన సర్వీసుల వివరాలు:

AI130 - లండన్ హీత్రో-ముంబై - వియన్నాకు మళ్లించబడింది
AI102 - న్యూయార్క్-ఢిల్లీ - షార్జాకు మళ్లించబడింది
AI116 - న్యూయార్క్-ముంబై - జెడ్డాకు మళ్లించబడింది
AI2018 - లండన్ హీత్రో-ఢిల్లీ - ముంబైకి మళ్లించబడింది
AI129 - ముంబై-లండన్ హీత్రో - ముంబైకి తిరిగి వెళ్ళడం
AI119 - ముంబై-న్యూయార్క్ - ముంబైకి తిరిగి వెళ్ళడం
AI103 - ఢిల్లీ-వాషింగ్టన్ - ఢిల్లీకి తిరిగి వెళ్ళడం
AI106 - న్యూవార్క్-ఢిల్లీ - ఢిల్లీకి తిరిగి వెళ్ళడం
AI188 - వాంకోవర్-ఢిల్లీ - జెడ్డాకు మళ్లించడం
AI101 - ఢిల్లీ-న్యూయార్క్ - ఫ్రాంక్‌ఫర్ట్/మిలన్‌కు మళ్లించడం
AI126 - చికాగో-ఢిల్లీ - జెడ్డాకు మళ్లించడం
AI132 - లండన్ హీత్రో-బెంగళూరు - షార్జాకు మళ్లించబడింది
AI2016 - లండన్ హీత్రో-ఢిల్లీ - వియన్నాకు మళ్లించబడింది
AI104 - వాషింగ్టన్-ఢిల్లీ - వియన్నాకు మళ్లించబడింది
AI190 - టొరంటో-ఢిల్లీ - ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించబడింది
AI189 - ఢిల్లీ-టొరంటో - ఢిల్లీకి తిరిగి రాక. 

Videos

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

నేపాల్ లో సోనుసూద్.. వరద బాధితులకు అండగా రియల్ హీరో

వేటు పడుద్ది! KC వేణుగోపాల్ తో కొండా సురేఖ భేటీ

Photos

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)