Breaking News

అందుకే లండన్‌ విమానం రద్దు చేశాం: ఎయిరిండియా క్లారిటీ

Published on Tue, 06/17/2025 - 13:06

సాక్షి, న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానాలు హడలెత్తిస్తున్నాయి. అహ్మదాబాద్‌ ప్రమాదం తర్వాత బయట పడుతున్న సాంకేతిక లోపాల ఘటనలు ‘వామ్మో.. ఎయిరిండియా’ అనేలా చేస్తున్నాయి. తాజాగా.. మంగళవారం మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తి రద్దయ్యిందనే వార్తలు రాగా.. ఎయిరిండియా అందులో నిజం లేదని వివరణ ఇచ్చుకుంది. 

ఆంగ్ల మీడియా సంస్థల కథనం ప్రకారం.. అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ వెళ్లే  ఎయిరియిండియా విమానంలో సాంకేతిక సమస్య  బయటపడింది. మధ్యాహ్నం 1.10 గంటలకు AI 159 బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌కు బయల్దేరాల్సి ఉండగా.. పైలట్‌ టేకాఫ్‌ కంటే ముందు సాంకేతిక లోపం గుర్తించారు. దీంతో విమానంలోని 200 మంది ప్రయాణికులను దించేశారు. 

తొలుత సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసిన నిర్వాహకులు.. చివరకు ఫ్లైట్‌ సర్వీసును తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. జూన్‌ 12వ తేదీన ఇదే రూట్‌లో ప్రయాణించే ఎయిరింయా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంతో ఏఐ 171 విమానాన్ని పూర్తిగా రద్దు చేసింది ఎయిరిండియా. దాని స్థానంలోనే AI 159 విమానానికి తీసుకు వచ్చింది. అయితే.. 

అనూహ్యంగా.. ఇవాళ ఆ విమానంలోనూ సాంకేతిక సమస్య తలెత్తడం.. టేకాఫ్‌కి ముందే ఆ సమస్యను గుర్తించడం.. చివరకు సర్వీస్‌ రద్దు కావడం జరిగిపోయాయి. విమాన రద్దు నిర్ణయంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. 

ఇదిలా ఉంటే.. ఏఐ 159 విమాన రద్దుపై ఎయిరిండియా వివరణ ఇచ్చుకుంది. విమానం సిద్ధంగా లేకపోవడంతోనే రద్దు చేశామని స్పష్టత ఇచ్చింది. ప్రయాణికులకు హోటల్‌లో వసతు కల్పిస్తున్నామని, అడిగిన వారికి డబ్బులు సైతం వెనక్కి ఇస్తున్నామని, ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడబోమని ఎయిరిండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. 

Videos

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు