Breaking News

Air India crash: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం.. దెబ్బతిన్న బ్లాక్‌ బాక్స్‌

Published on Thu, 06/19/2025 - 11:03

సాక్షి,ఢిల్లీ: ఎయిరిండియా బోయింగ్‌ 787-8 డ్రీమ్‌ లైనర్‌ (Air India Boeing 787-8 Dreamliner) విమాన ప్రమాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూన్‌ 12న  గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి గల కారణాల్ని వెలికి తీసే బ్లాక్ బాక్స్‌ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

అయితే, అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి దెబ్బతిన్న బ్లాక్‌ బాక్స్‌ నుంచి వివరాల్ని సేకరించేందుకు కేంద్రం  అమెరికాకు తరలించినట్లు సమాచారం. తాజా బ్లాక్‌ బాక్స్‌ పరిణామంపై కేంద్రం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

ఏప్రిల్‌ 12న అహ్మదాబాద్‌ నుంచి ఎయిరిండియా 787 డ్రీమ్‌లైనర్ విమానం 242 మందితో లండన్‌ బయల్దేరింది. కానీ, ఆ విమానం నేల మీద నుంచి పైకి లేచిన కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఘోరమైన తప్పు ఏదో జరిగింది. విమానంలో తీవ్ర ఇబ్బంది తలెత్తింది. అందులో నుంచి ఒక మేడే కాల్ వెళ్లింది. అంతలోనే రద్దీగా ఉండే  మేఘానీనగర్‌  బీజే మెడికల్ కాలేజీ ప్రధాన క్యాంపస్‌పై కప్పు మీద ఆ విమానం కూలిపోయి (air india crash video) అగ్ని గుండంలా మారింది. విమానంలోని  మృత్యుంజయుడు విశ్వాస్ కుమార్ రమేష్‌ తప్ప మిగిలిన వారందరినీ అగ్ని దహించివేసింది. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న వారితో పాటు బీజే మెడికల్‌ కాలేజీ క్యాంపస్‌లో బాధితుల్ని కలుపుకొని మొత్తం 270 మంది మరణించినట్లు తెలుస్తోంది.

ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండడంతో వైద్యులు బాధిత  కుటుంబ సభ్యుల డీఎన్‌ఏ ఆధారంగా మృతదేహాల్ని గుర్తిస్తున్నారు. ఘటనా స్థలంలో మృతదేహాలను డీఎన్‌ఏతో మ్యాచ్‌ చేసి చూస్తున్నారు. గుజరాత్‌ ప్రభుత్వ వైద్యులు మృతదేహాల్ని ఎనాలసిస్‌ చేసి మొత్తం 208 మృతదేహాల్ని గుర్తించారు.  అలా ఇప్పటి వరకు (ఏప్రిల్‌ 18) ఉన్న సమాచారం ప్రకారం.. 170 మృతదేహాల్ని డీఎన్‌ఏతో గుర్తించారు. వారిలో యూకే, ఫోర్చుగల్‌,కెనడాతో పాటు ప్రమాదంలో మరణించిన మరో ఆరుగురు మృత దేహాల్ని వారి కుటుంబ సభ్యులకు అందించారు. 

 

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు