Breaking News

Air India crash probe: ‘ఇంధన స్విచ్‌లలో ఇబ్బందే లేదు’

Published on Thu, 07/17/2025 - 07:09

న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో గత నెలలో ఎయిర్‌ ఇండియా విమానం కూలిపోయిన దరిమిలా, ఈ ఘటనపై దర్యాప్తు సంస్థలు ముమ్మర విచారణ జరుపుతున్నాయి. ఇదే కోవలో ఎయిర్‌ ఇండియా కూడా వ్యవస్థీకృత లోపాలపై పరిశీలన జరుపుతోంది. తాజాగా ఎయిర్ ఇండియా తమ బోయింగ్ 787-8 విమానాలలోని ఇంధన నియంత్రణ స్విచ్ (ఎఫ్‌సీఎస్‌) లాకింగ్ మెకానిజానికి సంబంధించిన ముందు జాగ్రత్త తనిఖీలను నిర్వహించింది.

ఈ నేపధ్యంలో ఇంధన నియత్రణ స్విచ్‌లతో ఎటువంటి సమస్యలు లేవని టాటా యాజమాన్యంలోని ఎయిర్‌లైన్ అధికారులు స్పష్టం చేశారు. పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)బోయింగ్ విమాన నమూనాల ఎప్‌సీఎస్‌ను తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసిన  దరిమిలా ఎయిర్ ఇండియా ఈ తనిఖీలను నిర్వహించింది. బోయింగ్ నిర్వహణ షెడ్యూల్ ప్రకారం అన్ని బోయింగ్ 787-8 విమానాలలో పరిశీలనలు చేశారు.

తమ ఇంజనీరింగ్ బృందం ఎస్‌సీఎస్‌ లాకింగ్ మెకానిజంపై ముందు జాగ్రత్త తనిఖీలను పూర్తి చేసింది. వాటిలో ఎటువంటి సమస్యలు లేవని అధికారులు తెలిపారు. లాకింగ్ ఫీచర్‌తో సహా ఇంధన నియంత్రణ స్విచ్ డిజైన్  అన్ని బోయింగ్ విమాన నమూనాలలో ఒకే తరహాలోనే ఉంటుందని, అహ్మదాబాద్‌లో  ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8లో కూడా ఇదే తరహా స్విచ్‌ ఉందని ఎయిర్‌ ఇండియా అధికారులు తెలిపారు.

Videos

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

జూడో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం

Photos

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)